Telangana | తెలంగాణలో 82 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు.. కాంగ్రెస్ నుంచే 51 మంది
Telangana | తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 82 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. సీరియస్ క్రిమినల్ కేసులు 59 మంది ఎమ్మెల్యేలపై ఉన్నట్లు తెలిపింది. ఈ వివరాలను అభ్యర్థుల ఆఫిడవిట్ల ఆధారంగా వెల్లడించినట్లు ఏడీఆర్ పేర్కొంది.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 82 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. సీరియస్ క్రిమినల్ కేసులు 59 మంది ఎమ్మెల్యేలపై ఉన్నట్లు తెలిపింది. ఈ వివరాలను అభ్యర్థుల ఆఫిడవిట్ల ఆధారంగా వెల్లడించినట్లు ఏడీఆర్ పేర్కొంది. 2018 ఎన్నికల ఆఫిడవిట్లను పరిశీలిస్తే 73 మంది ఎమ్మెల్యేలపై మాత్రమే క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేపై మర్డర్ కేసు ఉండగా, ఏడుగురిపై హత్యాయత్నం కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇద్దరు ఎమ్మెల్యేలపై మహిళలను వేధించిన కేసులు నమోదు అయ్యాయి. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల్లో 51 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ నుంచి 19, బీజేపీ నుంచి ఏడుగురు, సీపీఐ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి నలుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. సీరియస్ క్రిమినల్ కేసుల విషయానికి వస్తే.. కాంగ్రెస్ నుంచి 31 మంది, బీఆర్ఎస్ నుంచి 17 మంది, బీజేపీ నుంచి ఏడుగురు, సీపీఐ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి ముగ్గురు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

