ఓపెన్ స్కూళ్లలోనూ క్రెడిట్ ట్రాన్స్ఫర్
మీరు.. ఎస్సెస్సీలో లేదా ఇంటర్లో కొన్ని సబ్జెక్టులు తప్పారా.. ఇక నా వల్లకాదని వదిలేశారా.. అయితే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో పది లేదా ఇంటర్లో చేరండి.
- రెగ్యులర్‌గా పాసైన రెండు సబ్జెక్టులు ఓపెన్‌కు
- ఎస్సెస్సీ, ఇంటర్లో తప్పిన విద్యార్థులకు మంచి అవకాశం
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : మీరు.. ఎస్సెస్సీలో లేదా ఇంటర్లో కొన్ని సబ్జెక్టులు తప్పారా.. ఇక నా వల్లకాదని వదిలేశారా.. అయితే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో పది లేదా ఇంటర్లో చేరండి. గతంలో రెగ్యులర్‌గా పాసైన రెండు సబ్జెక్టుల క్రెడిట్స్‌ను ఓపెన్ స్కూల్‌కు బదలాయించుకోవచ్చు. ఓపెన్ స్కూళ్లలో చేరిన వారు ఏదైనా 5 సబ్జెక్టులు పాసైతే సరిపోతుంది. క్రెడిట్ ట్రాన్స్ఫర్తో రెండు సబ్జెక్టులు పాస్ అయినట్టే. అంటే మరో మూడు సబ్జెక్టులకు పరీక్షలు రాస్తే సరిపోతుంది. సంబంధిత విద్యార్థులు 2018 తర్వాత మార్చి, జూన్ తర్వాత ఆయా సబ్జెక్టులు పాసై ఉండాలి.
మ్యాథ్స్ లేకుండా..
సాధారణంగా పదో తరగతి అంటేనే తెలుగు/ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, గణితం, భౌతిక,రసాయన, జీవశాస్త్రాలు, సాంఘికశాస్త్రం సబ్జెక్టులుగా ఉంటాయి. ఇంటర్‌లోనూ కోర్సుల తీరు నిర్దిష్టంగా ఉంటుంది. కానీ ఓపెన్ స్కూల్లో డిగ్రీ తరహాలో బకెట్ సిస్టంను అమలుచేస్తున్నారు. పది, ఇంటర్లో సబ్జెక్టులను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ -ఏ, గ్రూప్ – బీ, గ్రూప్ -సీలో నచ్చిన సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవచ్చు. గ్రూప్ -బీలో గణితం కఠినంగా ఉంటుందనుకొనే వారు సులభంగా ఉండే హోమ్‌సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ సంస్కృతి, వారసత్వం, బిజినెస్ స్టడీస్‌లో ఏదో రెండు సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. ఎంసెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలు రాసే వారు వీటికి సంబంధించిన సబ్జెక్టులు తీసుకోవచ్చు.
కొనసాగుతున్న ప్రవేశాలు..
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే దరఖాస్తుకు గడువు ముగియగా, ఆలస్య రుసుంతో ఈ నెల 31 వరకు అవకాశం ఉన్నది. ఇప్పటివరకు పదో తరగతి, ఇంటర్ కలిపి 10వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టుగా అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

