ఉద్యమాల గడ్డపై బీజేపీని బొందపెడుతాం : తమ్మినేని వీరభద్రం
నల్లగొండ : ఉద్యమాల గడ్డపై కాషాయ జెండాలను ఎగురనివ్వం. బీజేపీని ఓడించడమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
బుధవారం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో సీపీఎం మునుగోడు నియోజవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గత 8 సంత్సరాలుగా రాజ్యాంగ హక్కులు, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తూ దేశంలో దుర్మార్గ పాలన బీజేపీ చేస్తోందని మండిపడ్డారు.
దేశంలో అన్ని మతాల వారు ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇప్పుడు మైనార్టీలు ఈ దేశంలో ఉండొద్దు అని బీజేపీ వాళ్లు మత ఘర్షలను రెచ్చ గడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది.

తెలంగాణ సాయుధ వారోత్సవాలు, స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలు నిర్వహించే హక్కు బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రాలకు ఉన్న అన్ని హక్కులను లాక్కుంటు కేంద్రం నియంతృత్వ పాలన సాగిస్తున్నది మండిడ్డారు.
దేశ హోం మంత్రిగా ఉండి అమిత్ షా మునుగోడు సభలో స్పష్టంగా తెలిపారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నెల రోజుల్లో కూలగొడుతాం అని ఎలా చెబుతారని నిలదీశారు.
సాయుధ పోరాటాలతో అన్యాయాల్ని ఎదురించిన తెలంగాణ గడ్డపై బీజేపీని అడ్డుకోవడమే తమ ఎజెండా అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడాలని కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

