CPI Narayana on Amitshah | అమిత్‌షా మాటలు ప్రజాస్వామ్యానికి, లౌకికతత్వానికి వ్యతిరేకం.. సీపీఐ నేత నారాయణ
CPI Narayana on Amitshah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు, లౌకికతత్వానికి వ్యతిరేకం అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు.
CPI Narayana on Amitshah | తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ల బిల్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. ఆయన ఈ మేరకు సోమవారం ఒక వీడియో విడుదల చేశారు. `కేంద్రంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోంమంత్రి మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం దురదృష్టకరం` అని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తామని చేవేళ్ల సభలో హోంమంత్రి అమిత్‌షా చెప్పడాన్ని నారాయణ తప్పుపట్టారు.
గతంలో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్ని మతాల్ని, కులాలను కలుపుకుని పోవాలని కీలక సమావేశాల్లో చెప్పారని నారాయణ గుర్తు చేశారు. అధికారం కోసం పాకులాడే వాళ్ళు రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చన్నారు. అలా కాక మతతత్వం రెచ్చగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో సీపీఐ నాయకులు చండ్రరాజేశ్వర్రావు ముస్లింల స్థితిగతులను పరిశీలించినప్పుడు దళితులు, గిరిజనుల కంటే ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారనే తేలిందన్నారు.
అంతేకాకుండా సచార్, శ్రీరంగరాజ కమిటీల పరిశీలనలోనూ ముస్లింలు ఎక్కువ శాతం పేదరికంలో ఉన్నారని నివేదిక ఇచ్చాయని నారాయణ గుర్తుచేశారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఐదు నుంచి నాలుగు శాతానికి రిజర్వేషన్లు తగ్గించారన్నారు. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Management | నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ.. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
Krishna River | రోజుకో టీఎంసీ.. శ్రీశైలం నుంచి 79 రోజుల్లో 72 టీఎంసీలు ఎత్తిపోసిన ఏపీ
Congress Minister | బెడిసికొట్టిన మంత్రి వ్యూహం.. ముఖ్య పదవిని ఆశిస్తే అసలుకే మోసం!
Rice Price | రూ.100కు చేరినసన్నబియ్యం.. మూడు నెలల్లో 30 నుంచి 40 శాతం పెరిగిన కిలో ధర
Revanth Reddy | లక్షన్నర కోట్ల విలువైన భూములు అమ్ముతం.. కేసీఆర్ కంటే కూడా నేను శ్రీమంతుడిని: రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

