కోర్సు కంపెనీది.. క్లాసు కాలేజీది

- కోర్సుల రూపకల్పనలో మారుతున్న ట్రెండ్
- సొంతంగా రూపొందించుకొంటున్న సంస్థలు
- కాలేజీలతో ఒప్పందాలతో క్లాసుల నిర్వహణ
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): డిగ్రీ, ఇంజినీరింగ్, వృత్తివిద్యా కోర్సుల రూపకల్పన విధానం క్రమంగా మారుతున్నది. కోర్సులను రూపొందించే జాతీయ సంస్థలు, విద్యాసంస్థలకు బదులుగా ఆయా రంగం, పారిశ్రామిక వర్గాలే తమకు అవసరమైన కోర్సు రూపొందించి విద్యాసంస్థలకు అందిస్తున్నాయి. ఇటీవల చాలా సంస్థలు ఇదే ధోరణి అనుసరిస్తున్నాయి.
కోర్సులు, కరిక్యులం..
మనదేశంలో ఇప్పటివరకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందడంలేదు. కాలేజీ పాఠాలకు, ఉద్యోగం వచ్చిన తర్వాత చేసే పనికి పొంతన ఉండటం లేదు. పరిశ్రమ అవసరాలు విద్యాసంస్థలకు తెలియకపోవడంతో విద్యార్థులు నేర్చుకున్నవి వృత్తిజీవితంలో ఉపయోగపడటంలేదు. ఈ నేపథ్యంలో తమకు కావాల్సిన కోర్సులు, కరిక్యులంను ఆయా రంగాల్లోని సంస్థలే రూపొందిస్తున్నాయి. డీఆర్డీవో, టీసీఎస్ లాంటి దిగ్గజ సంస్థలు ఇదే బాటలో పయనిస్తూ వర్సిటీలతో ఒప్పందాలు చేసుకొంటున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేయగానే నేరుగా ప్లేస్‌మెంట్స్ లభిస్తుండటంతో విద్యార్థులు వాటిల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
మచ్చుకు కొన్ని..
- గీతంలో యూనివర్సిటీలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ కంప్యూటర్‌సైన్స్ అండ్ కాగ్నెటివ్ సిస్టమ్స్ కోర్సును ప్రవేశపెట్టారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ కోర్సుకు రూపొందించడమే కాకుండా ఏఐసీటీఈ నుంచి అనుమతులు తెచ్చుకున్నది. గీతం యూనివర్సిటీ కేవలం క్లాసులు నిర్వహించటానికే పరిమితం కానున్నది.
- రక్షణశాఖలో ఇంజినీర్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని డీఆర్డీవో సహకారంతో ఎంటెక్ డిఫెన్స్ టెక్నాలజీ కోర్సుకు రూపకల్పన చేశారు. దీనికి అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవలే అనుమతిచ్చింది. ఈ ఏడాది నుంచి బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీల్లో ఈ కోర్సును నిర్వహించనున్నారు.
- డిగ్రీలో బీఎస్సీ డాటా సైన్స్ కోర్సును టీసీఎస్ సంస్థే రూపొందించింది. కోర్సు బోధనను సైతం ఆ సంస్థే చేపట్టింది. టీసీఎస్ సంస్థలో పనిచేసే వృత్తినిపుణులతో తరగతులు చెప్పిస్తున్నది.
- హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ కోర్సు నిర్వహణకు బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంతో అపోలో సంస్థ ఒప్పందం చేసుకొన్నది. ఈ కోర్సుకు యూజీసీ అనుమతులు రావాల్సి ఉన్నది. ఇక సైనికులకు గోల్కొండ సహా మరో కేంద్రంలో శిక్షణ ఇస్తుండగా, వారికి బీఆర్ఏఓయూ ద్వారా సర్టిఫికెట్లు జారీచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

