నిర్మల్‌లో కార్డన్ సెర్చ్.. పెద్ద ఎత్తున వాహనాలు సీజ్
నిర్మల్ కార్డన్ సెర్చ్.. పెద్ద ఎత్తున వాహనాలు సీజ్ | జిల్లా కేంద్రంలోని సోఫినగర్ ప్రాంతంలో గురువారం ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఉపేందర్ నేతృత్వంలో

నిర్మల్ : జిల్లా కేంద్రంలోని సోఫినగర్ ప్రాంతంలో గురువారం ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఉపేందర్ నేతృత్వంలో బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మనకు తెలియకుండానే చుట్టుపక్కల సంఘ విద్రోహులు ఉండడంతో పాటు సంచరించే అవకాశాలుంటాయన్నారు. వారి ఆట కట్టించే క్రమంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తామని వివరించారు. కొత్త వ్యక్తులు, అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఎవరైనా తమ ఇండ్లను అద్దెకు ఇచ్చే ముందు ఆధార్, ఓటర్‌కార్డు గుర్తింపు పరిశీలించాలని చెప్పారు.
కొత్త వ్యక్తుల ద్వారా వాహనాలు కొనడం, అమ్మడం సమస్యలు కొని తెచ్చుకోవడమేనన్నారు. మంత్రాల పేరిట వచ్చే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గతంలో జరిగిన మోసాలను ఈ సందర్భంగా డీఎస్పీ గుర్తు చేశారు. ప్రజలంతా స్నేహభావంతో, ప్రశాంత వాతావరణంలో ఉండాలని, పోలీసులకు ప్రజలందించే సహకారంతో సంఘ వ్యతిరేకశక్తులను మరింత సమర్థవంతంగా అణచివేయగలమని స్పష్టం చెప్పారు. ఈ సందర్భంగా తనిఖీల్లో 87 మోటార్ సైకిళ్లు, మూడు కార్లు, ఏడు ఆటోలను సీజ్ చేశారు. పట్టణ, సోన్ సీఐలు శ్రీనివాస్, రాంనర్సింహారెడ్డి, ఎస్ఐలు, సుమారు వంద మంది పోలీస్ సిబ్బంది సోఫినగర్‌లో పలువురు వ్యక్తుల గుర్తింపు పత్రాలు, వాహనాలను తనిఖీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంక్రాంతికి ముస్తాబు
నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

