విపణిలోకి విజయ బ్రాండ్ వంట సరుకులు

- విపణిలోకి విజయ బ్రాండ్ వంట సరుకులు
- బియ్యం, ఉప్పు, పప్పు, మసాలా విక్రయాలు
- ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో 22 కొత్త ఉత్పత్తులు
- రూ.15 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్ రెడీ
- నేడు లాంఛనంగా ప్రారంభం
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ‘విజయ’ బ్రాండ్ వంటగది సిద్ధమవుతున్నది. ఇటు విజయ డెయిరీ, అటు ఆయిల్ ఫెడ్ సంస్థలు వంటకు అవసరమయ్యే అన్ని సరుకులను విజయ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే విజ య బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులు, వంట నూనెలను సరఫరా చేస్తున్నది. వీటికితోడు ఇప్పుడు ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో మరో 22 రకాల కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో రూ.15 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్ సిద్ధమైంది. దీన్ని సోమవారం లాంఛనంగా ప్రారంభించి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. నాణ్యతకు, నమ్మకానికి పెట్టింది పేరైన విజయ బ్రాండ్ పేరుతో సరసరమైన ధరల్లో అందించేందుకు ఆయిల్‌ఫెడ్ ప్రయత్నిస్తున్నది.
22 రకాల ఉత్పత్తులు
బియ్యం, బాస్మతి బియ్యం, పప్పులు, మినుపగుళ్లు, జొన్నపిండి, గోధుమ పిండి, రాగి పిండి, మసాలా టీ పొడి, అయోడైజ్డ్ ఉప్పు, కల్లు ఉప్పు, పల్లీలు, బాదంపప్పు, జీడిపప్పుడు, కిస్మిస్, ఆక్రూట్, అంజీరా, బిర్యానీ మసాలాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, తాలింపు దినుసులు, మిరియాలు సహా 22 కొత్త ఉత్పత్తులను ఆయిల్ ఫెడ్ తీసుకురానున్నది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని స్టోర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔట్లెట్లలో వీటిని అందుబాటులో ఉంచనున్నది.
సరసమైన ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులు
ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను సరసరసరమైన ధరల్లో అందించాలని నిర్ణయించాం. ప్రస్తుతం వంట నూనెలు సహా 22 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. భవిష్యత్‌లో ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తాం. – కంచర్ల రామకృష్ణారెడ్డి, చైర్మన్ ఆయిల్ ఫెడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

