Congress | మా మేడం వచ్చేదాక చెక్కులు ఇవ్వొద్దు.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలి కోసం ఎమ్మెల్యేను అడ్డుకున్న సంగారెడ్డి నేతలు
సంగారెడ్డిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను బుధవారం కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వచ్చేవరకు నేతల అడ్డగింత
- గంటన్నరపాటు వేచిచూసి వెళ్లిపోయిన ఎమ్మెల్యే చింతా
Congress | సంగారెడ్డి, జనవరి 10 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను బుధవారం కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఎలా పంపిణీ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి వచ్చేవరకు చెక్కులు పంపిణీ చేయొద్దు.
మా మేడం వచ్చిన తర్వాతే లబ్ధిదారులకు చెక్కులు అందజేయాలి’ అని కాంగ్రెన్ శ్రేణులు పట్టుబట్టారు. దీంతో గంటన్నరపాటు వేదికపైనే ఉన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. తాను రెండు చెక్కులు పంపిణీ చేస్తానని, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలతో పంపిణీ చేయించాలని అధికారులకు సూచించారు. ఇందుకు స్పందన లేకపోవడంతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చెక్కులు పంపిణీ చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి వచ్చి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఎలాంటి ప్రొటోకాల్ లేని నిర్మలారెడ్డి ఏ హోదాలో చెక్కులు పంపిణీ చేస్తారని సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగారెడ్డి జిల్లాలో తరచూ ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని, అయినా.. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

