కరెంట్ కోతలతోనే నా పంట ఎండింది
‘సర్.. కరెంట్ కోతలతో నా పంట ఎండిపోయింది. అప్పులన్నీ మీదపడ్డాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో అర్థమైతలేదు. నేను పుట్టెడు కష్టంలో ఉన్న’ అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రైతు అంగోతు రాములు నాయక్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎదుట వాపోయారు.
- దిగుబడి రాక అప్పులే మిగిలాయి.. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో గోడువెళ్లబోసుకున్న కాంగ్రెస్ కార్యకర్త
గోపాల్పేట, నవంబర్ 7 : ‘సర్.. కరెంట్ కోతలతో నా పంట ఎండిపోయింది. అప్పులన్నీ మీదపడ్డాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో అర్థమైతలేదు. నేను పుట్టెడు కష్టంలో ఉన్న’ అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రైతు అంగోతు రాములు నాయక్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎదుట వాపోయారు. శనివారం ఆయన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం శివారులోని పాటిగడ్డ తండాలో ఎండిన పంట పొలాలను పరిశీలించారు.
కాంగ్రెస్ వార్డు సభ్యుడు రాములు నాయక్ పొలాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా రాములు నాయక్.. నిరంజన్‌రెడ్డి ఎదుట తన గోడువెళ్లబోసుకున్నాడు. ‘నాకున్న ఎకరా పొలంతోపాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేసిన. పంట చేతికొచ్చే దశలో ట్రాన్స్ఫార్మర్ తరచూ మరమ్మతులకు గురైంది. విద్యుత్తు కోతల కారణంగా పంటకు నీరందక మూడెకరాల్లో వరి ఎండిపోయింది. రూ.లక్షలు ఖర్చు చేసిన. దిగుబడులు రాక అప్పులే మిగిలాయి’ అంటూ వాపోయారు.
అతడి సమస్యలను తెలుసుకొని, ఎండిన పంటను పరిశీలించిన నిరంజన్‌రెడ్డి చలించిపోయారు. బాధిత రైతు నాయక్‌ను ఓదార్చి.. వ్యక్తిగతంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. కలెక్టర్‌కు లేఖ రాసి ప్రభుత్వపరంగా పరిహారం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఇందుకు రాములు నాయక్ స్పందిస్తూ.. ‘సర్.. పంట ఎండి పోయి బాధపడుతున్న నన్ను సొంత పార్టీ నాయకులు పరామర్శించలేదు. మీరు నా పంటను పరిశీలించి, నన్ను పరామర్శించారు. నాలో ధైర్యం నింపి, ఆర్థిక సాయం అందించారు’ అంటూ నిరజంన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

