ప్రాక్టికల్స్‌లో పూర్తి మార్కులు

- ‘ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్’ ఆధారంగా ఇంటర్ సెకండియర్ ఫలితాలు
- జీవో జారీచేసిన ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో పూర్తి మార్కులు కేటాయించ నున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పాస్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ పద్ధతిద్వారా విద్యార్థులందరికీ మార్కులు వేయాలని ఇంటర్‌బోర్డును ఆదేశిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం జీవో-100ను విడుదల చేశారు. 2020-21 సంవత్సరానికి కొవిడ్-19 దృష్ట్యా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దుచేయడంతో పాటు, వారికి ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా మార్కులేసేలా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ఫస్టియర్ విద్యార్థులందరినీ సెకండియర్లోకి ప్రమోట్‌చేయాలని జీవోలో సూచించారు. ఇంటర్‌బోర్డు నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలను సమర్పించనుంది.
ఇదీ విధానం..
అబ్జెక్టివ్ క్రైటీరియా ప్రకారం నిర్ధారించిన అంశాలవారీగా విద్యార్థులకు మార్కులేస్తారు. ఆయా మార్కులన్నింటిని కూడి విద్యార్థి సాధించిన మొత్తం మార్కులుగా పరిగణిస్తారు.
ఆ మార్కులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) చేత టెస్ట్ చేయిస్తారు.
సీజీజీ టెస్ట్చేసిన మార్కుల జాబితాను ఇంటర్‌బోర్డు తుది పరిశీలన జరిపి ఖరారుచేస్తుంది.
ఈ ప్రక్రియంతా పూర్తయిన తర్వాత ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఇందుకు మూడు నాలుగు రోజులు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ఫస్టియర్‌లో విద్యార్థులు సాధించిన మార్కులతోపాటు, సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో ఫుల్ మార్కులు వేయనున్నారు. మరికొన్ని అంశాలను కూడా అబ్జెక్టివ్ క్రైటీరియాలో పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

