హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ బీ క్యాటగిరీ సీట్ల భర్తీపై వచ్చిన ఫిర్యాదుల పరిశీలనకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇందుకు ప్రొఫెసర్లతో ఒక కమిటీని నియమించింది.
బీ క్యాటగిరీ సీట్ల భర్తీపై 26 కాలేజీలపై పలువురు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులపై కమిటీ విచారణ చేపట్టి.. సీట్లను ఆమోదించనున్నది.