Falaknuma Express | ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి విడిపోయిన బోగీలు.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు (Falaknuma Express) పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకులం జిల్లా పలాస వద్ద సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. దీంతో రైలును అధికారులు పలాస వద్ద నిలిపివేశారు.
శ్రీకాకులం: ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు (Falaknuma Express) పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకులం జిల్లా పలాస వద్ద సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. దీంతో రైలును అధికారులు పలాస వద్ద నిలిపివేశారు. విడిపోయిన బోగీలను సిబ్బంది రైలుకు అమరుస్తున్నారు. దీంతో గంట నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. విడిపోయిన బోగీలను రైలుకు బిగిస్తున్నామని, వీలైనంత తొందర్లోనే తన గమ్యస్థానానికి బయల్దేరుతుందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

