రేవంత్.. నీ బోనస్ వద్దు రైతుబంధు వద్దు ఫస్ట్ వడ్లు కొను!
‘నీ బోనస్ వద్దు.. నీ రైతుబంధు వద్దు.. ఫస్ట్ వడ్లు కొను’ అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆందోళనకు దిగారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లి, సంగెం గ్రామాల రైతులు ట్రాక్టర్లలో ధాన్యం పోసుకుని పెద్దఎత్తున తరలివచ్చి..
- నీ బోనస్ వద్దు.. నీ రైతుబంధు వద్దు
- ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం
- యాదాద్రి కలెక్టరేట్ ఎదుట రైతన్నల ఆందోళన
- రోడ్డుపై ధాన్యం ట్రాక్టర్లతో నిరసన
- వారాలు గడుస్తున్నా కొంటలేరని రాస్తారోకో
- సీఎం రేవంత్ తీరును తూర్పారబట్టిన రైతులు
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ‘నీ బోనస్ వద్దు.. నీ రైతుబంధు వద్దు.. ఫస్ట్ వడ్లు కొను’ అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆందోళనకు దిగారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లి, సంగెం గ్రామాల రైతులు ట్రాక్టర్లలో ధాన్యం పోసుకుని పెద్దఎత్తున తరలివచ్చి.. భువనగిరి కలెక్టరేట్ ఎదుట రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి ధర్నాకు దిగారు.
రోడ్డుపై ధాన్యం పోసి నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులైనా ధాన్యం సరిగా కొంటలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసినా లారీలు రావడం లేదని, వచ్చినా 40 కిలోల ధాన్యం బస్తాకు రూ.5 తీసుకుంటున్నారని వాపోతున్నారు. ఏ-గ్రేడ్ ధాన్యం మిల్లుల వద్దకు రాగానే బీ-గ్రేడ్ ధాన్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. క్వింటాల్‌కు 5 కిలోలు తరుగు పేరుతో కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కల్లాల వద్ద పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, అధికారులు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. పోలీసుల జోక్యం వాగ్వాదానికి దారితీసింది. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అనంతరం పలువురు రైతులు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోమ్‌కు వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

