CM Revanth Reddy | మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు.
CM Revanth Reddy | మహబూబ్‌నగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్ వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్లతో నిర్మించబోయే బాలికల హాస్టల్ నిర్మాణానికి, దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి, మహబూబ్‌నగర్ రూరల్‌లో రూ.3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి, గండీడ్‌లో రూ.6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి, పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో ఎస్టీపీ, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు, రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

