CM Revanth Reddy | వద్దన్న రేవంతే.. ‘సలహా’ పీఠమిచ్చె.. 7 నెలల్లో 9 మంది నియామకం
ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రాజకీయ పునరావాస కేంద్రంగా అభివర్ణించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు సగటున నెలకు ఒకరిని సలహాదారుగా నియమిస్తున్నారు.
- గతంలో సలహాదారులను వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రాజకీయ పునరావాస కేంద్రంగా అభివర్ణించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు సగటున నెలకు ఒకరిని సలహాదారుగా నియమిస్తున్నారు. తమ అనుభవం ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వడానికి సలహాదారులును ప్రభుత్వాలు నియమించుకుంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయారంగాల వారిని సలహాదారులుగా నియమించింది.
అయితే అప్పుడు సలహాదారుల నియామకంపై రేవంత్‌రెడ్డి న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయనే సీఎంగా 9 మందిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. రాజకీయ నాయకుల నుంచి కేశవరావు, ఏపీ జితేందర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, షబ్బీర్‌అలీని సలహాదారులుగా నియమించింది. అధికారుల నుంచి ఏపీ క్యాడర్‌కు చెందిన ఆదిత్యనాథ్‌దాస్, శ్రీనివాస్‌రాజును, నీటిపారుదల రంగానికి పెంటారెడ్డి, అసెంబ్లీ సలహాదారుడిగా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను నియమించారు.
తెలంగాణకు వ్యతిరేకంగా వాదించిన అధికారులు ప్రస్తుతం తెలంగాణకు సలహాదారులుగా నియమించటంపై తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సలహాదారులే కాకుండా ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులుగా కూడా ఇద్దరిని నియమించారు. మల్లు రవి, ఏపీ జితేందర్‌రెడ్డిని నియమించారు. బీజేపీ నుంచి రాగానే ఏపీ జితేందర్‌రెడ్డికి రెండు కీలక పదవులు ఇచ్చారని, దీనిపై కాంగ్రెస్ వర్గాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. క్యాబినెట్ ర్యాంకుతో సమానంగా వీరికి జీతభత్యాలను కట్టబెడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు
1) కే కేశవరావు
2) షబ్బీర్ అలీ
c4) ఏపీ జితేందర్‌రెడ్డి
5) హర్కర వేణుగోపాల్
6) సూర్యదేవర ప్రసన్నకుమార్ (అసెంబ్లీ సలహాదారు)
7) ఆదిత్యనాథ్‌దాస్
8) శ్రీనివాస్‌రాజు
9) పెంటారెడ్డి
ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు మల్లు రవి, ఏపీ జితేందర్‌రెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

