Revanth Reddy | అభద్రతా భావంలో కూరుకుపోయిన రేవంత్ రెడ్డి : బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Revanth Reddy | పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్‌లో, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.
Revanth Reddy | పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్‌లో, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్రకార్యాలయంలో వారికి లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
వందరోజుల పాలనను రెఫరెండంగా భావించి ఓటు వేయాలని సీఎం గతంలో అనేక సార్లు చెప్పారని కె.లక్ష్మణ్ గుర్తు చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి కాంగ్రెస్ మాట మారుస్తున్నదని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే అన్ని గ్యారంటీలు నెరవేరుతాయని చెబుతున్నారని అన్నారు. ఇది బోడి గుండుకు మోకాలికు ముడిపెట్టడమేనని ఎద్దేవా చేశారు. ప్రజల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు తనపై కుట్ర జరుగుతున్నదంటూ సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ పార్లమెంట్లో తమ అభ్యర్థి మాధవీలత ముచ్చెమటలు పట్టిస్తున్నదని, అందుకే ఓవైసీని గెలిపించడానికి కాంగ్రెస్ సిద్ధమైందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే పొసగడం లేదని, గతంలో మాటల తూటాలు పేల్చే రేవంత్ రెడ్డి ఇప్పుడు సానుభూతి మాటలు మాట్లాడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవడం లేదని, అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారమని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

