ప్రతి నియోజకవర్గంలో అధునాతన కూరగాయల మార్కెట్లు: ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని వెల్లడించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని చెప్పారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని వెల్లడించారు. నిజాం హయాంలో కట్టిన మోండా మార్కెట్‌ని చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో సరిపడా వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు లేవన్నారు. హైదరాబాద్ మార్కెట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించామని వెల్లడించారు.
చాలా కూరగాయల మార్కెట్లు అనుకున్నంత పరిశుభ్రంగా లేవని సీఎం కేసీఆర్ అన్నారు. మురికిలో, మట్టి, దుమ్ములో కూరగాయలు అమ్మే పరిస్థితి ఉండేదని చెప్పారు. ఈనేపథ్యంలో సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అధునాతన కూరగాయల మార్కెట్లు ప్రతి నియోజకవర్గంలో తేవాలనే ఆలోచన ఉందని తెలిపారు. మోండా మార్కెట్‌ని కలెక్టర్లందరికీ చూపించామని, అలాంటి మార్కెట్లు అన్ని జిల్లాల్లో నిర్మించాలని సూచించామన్నారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నారాయణపేట కూరగాయల మార్కెట్ చాలా అద్భుతంగా కట్టినట్లు తాను విన్నానని చెప్పారు. కల్తీ విత్తనాల బెడద లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

