సీఎం కేసీఆర్ పెద్ద మనసు.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి సాయం
CM KCR | వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన ఓ విద్యార్థిని అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ యువతికి చికిత్స చేసేందుకు రూ.

వనపర్తి : వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన ఓ విద్యార్థిని అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ యువతికి చికిత్స చేసేందుకు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో యువతి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంది. బాధితురాలికి ఎంబీబీఎస్‌లో సీటు వచ్చినా కూడా.. ఈ వ్యాధి కారణంగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది.
మంత్రి నిరంజన్ రెడ్డి చొరవతో..

ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి రేవల్లి గ్రామస్తులు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి.. బాధిత యువతి శివాని తండ్రి బాల్ రెడ్డిని పిలిపించి మాట్లాడారు. శివాని ఆరోగ్య పరిస్థితిని మంత్రి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దమనసుతో శివాని చికిత్స నిమిత్తం రూ. 25 లక్షల ఎల్వోసీని మంజూరు చేశారు. ఎల్వోసీని ఇవాళ ఉదయం బాల్ రెడ్డికి మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు. దీంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో శివానికి చికిత్స చేయనున్నారు. శివాని కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

