కంగ్రాట్స్ అల్లు అర్జున్
తన అత్యుత్తమ నటన ద్వారా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దకించుకొన్న ప్రముఖ సినీహీరో అల్లు అర్జున్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. తెలుగు చలనచిత్రాలు సత్తాచాటడంపై ఆయన శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. 69 ఏండ్లలో తొలిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా అవార్డు దకడం గర్వకారణంగా ఉన్నదని చెప్పారు.
- 69 ఏండ్లకు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కడం హర్షనీయం
- తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు గర్వకారణం
- తెలుగు చిత్ర రంగాభివృద్ధికి మరింత కృషి: సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తన అత్యుత్తమ నటన ద్వారా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దకించుకొన్న ప్రముఖ సినీహీరో అల్లు అర్జున్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. తెలుగు చలనచిత్రాలు సత్తాచాటడంపై ఆయన శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. 69 ఏండ్లలో తొలిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా అవార్డు దకడం గర్వకారణంగా ఉన్నదని చెప్పారు. నాటితరం గొప్పనటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా, విలక్షణ నటులైన చిరంజీవి స్ఫూర్తితో నేటితరం నటుడిగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పదని కొనియాడారు.
తన సృజనాత్మక రచనతో సినీపాటల సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఆసార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు ఉత్తమ సినీ సాహిత్యానికి జాతీయ అవార్డు దకడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. చంద్రబోస్‌కు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ కాళభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులతోపాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగం హైదరాబాద్ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో తన ప్రతిభను చాటుతుండటం గొప్ప విషయమని పేర్కొన్నారు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షాదరణ పొందుతూ, ఫిల్మ్ ప్రొడక్షన్లో తెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలువడం గర్వ కారణమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో హైదరాబాద్ కేంద్రంగా తెలుగు సినిమా భారతీయ సినిమాతో పోటీపడుతుండటం అభినందనీయమని అన్నారు. తెలుగు చిత్ర రంగాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే ఉంటుందని భరోసా ఇచ్చారు. విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

