CID | కోరుట్లలో సీఐడీ అధికారుల సోదాలు.. పలు నకిలీ పాస్‌పోర్ట్‌లు స్వాధీనం
CID | జగిత్యాల జిల్లా కోరుట్ల(Korutla)లో శుక్రవారం హైదరాబాద్ సీఐడీ అధికారులు(CID officials) పలువురు పాస్‌పోర్టు ఏజెంట్ల ఇళ్లపై దాడులు నిర్వహించారు.
కోరుట్ల, జనవరి 19 : జగిత్యాల జిల్లా కోరుట్ల(Korutla)లో శుక్రవారం హైదరాబాద్ సీఐడీ అధికారులు(CID officials) పలువురు పాస్‌పోర్టు ఏజెంట్ల ఇళ్లపై దాడులు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు కోరుట్లకు చేరుకున్న సీఐడీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక పోలీసుల సాయంతో ముగ్గురు పాస్‌పోర్ట్ ఏజెంట్ల ఇళ్లలో సోదాలు చేశారు.
హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో కోరుట్లకు చెందిన ముగ్గురు పాస్‌పోర్టు ఏజెంట్లపై నమోదైన కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా అధికారులు వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారుల సోదాల్లో పలు నకిలీ పాస్‌పోర్ట్‌లు(Fake passports), పాస్‌పోర్ట్ మార్ఫింగ్‌కు సంబంధించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పట్టణానికి చెందిన ముగ్గురు పాస్‌పోర్టు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాల్లో సీఐడీ డీఎస్పీలు నందిరామ్, సంపత్, వెంకటేశ్వర్లు, రవీందర్, పది మంది సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

