నల్లగొండ జిల్లాలో కూలిన హెలికాప్టర్.. పైలట్ మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దవూర మండలం రామన్నగూడెం తండా వద్ద చాపర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మహిళా ట్రైనీ పైలట్ మహిమ మృతి చెందారు. మహిమ తమిళనాడుకు చెందిన యువతిగా గుర్తించారు. పైలట్ శరీర భాగాలు తునాతునకలుగా పడిపోయాయి. శరీర భాగాలు ముద్దలు ముద్దలుగా, గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రెవెన్యూ, వైద్య యంత్రాంగం కూడా ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. శిక్షణ హెలికాప్టర్ కూలిన విషయాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారులకు సమాచారం అందించారు.
భారీ శబ్దాలు.. దట్టమైన పొగలు
చాపర్ కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని స్థానిక రైతులు, కూలీలు పేర్కొన్నారు. దట్టమైన మంటలు, పొగలు వచ్చినట్లు తెలిపారు. హెలికాప్టర్ కూలిన వెంటనే అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. నాగార్జున సాగర్ వైపు నుంచి హెలికాప్టర్ వచ్చినట్లు రైతులు పేర్కొన్నారు.
ఫ్లైటెక్ ఏవియేషన్‌కు చెందిన చాపర్
ప్రమాదానికి గురైన చాపర్‌ను మాచర్ల మండలం నాగార్జున సాగర్ విజయపురిసౌత్‌లో ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్‌గా పోలీసులు గుర్తించారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో అదుపుతప్పి చాపర్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

