ఇన్చార్జి హెచ్ఎం కీచక పర్వం!.. ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులు
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి తోటి ఉపాధ్యాయులతో సోదరభావంతో ఉండాల్సిన ఓ ఇన్చార్జి హెచ్ఎం కీచకుడిలా మారాడు. తోటి ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధింపులకు గురిచేయగా, పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేటలో జరిగింది.
- ములుగు జిల్లా చల్వాయి హైస్కూల్లో ఘటన
- పీఎస్‌లో బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు
- కేసు నమోదు చేసిన పస్రా స్టేషన్ పోలీసులు
ములుగు, జూన్ 22 (నమస్తేతెలంగాణ) : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి తోటి ఉపాధ్యాయులతో సోదరభావంతో ఉండాల్సిన ఓ ఇన్చార్జి హెచ్ఎం కీచకుడిలా మారాడు. తోటి ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధింపులకు గురిచేయగా, పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చల్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న అదే మండలానికి చెందిన ఉపాధ్యాయుడు ఈ నెల 12న పాఠశాలకు వచ్చిన తోటి ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతని బారి నుంచి తప్పించుకున్న సదరు ఉపాధ్యాయురాలు తీవ్ర మనస్తాపం చెంది తోటి ఉపాధ్యాయులకు విషయాన్ని తెలియజేసింది.
విషయం బయటపడితే పాఠశాల పరువు పోతుందని, ఇన్చార్జి హెచ్ఎంతో మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చేస్తామని కొందరు ఉపాధ్యాయ సంఘాలనాయకులు బాధిత ఉపాధ్యాయురాలిపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోని ఉపాధ్యాయురాలు చట్టప్రకారం ముందుకు వెళ్లేందుకు సిద్ధపడి ఘటన జరిగిన వారం రోజుల అనంతరం పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఇన్చార్జి హెచ్ఎంపై ఫిర్యాదు చేయగా ఎస్సై కమలాకర్ కేసు నమోదుచేశారు. ఈ విషయమై ఎస్సైని వివరణ కోరగా ఈ నెల 19న బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని, ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

