Amla Powder | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): సహజ ఆహార ఉత్పత్తులకు ఇటీవల కాలంలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని శాస్త్రీయంగా అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా కృషి చేస్తున్న సెంట్రల్ ఫుడ్ టెక్నోలాజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ).. తాజాగా ఉసిరికాయల పొడిని ఆధునిక విధానంలో తయారు చేసేందుకు సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. స్వయం ఉపాధి సంఘాలతోపాటు యువ పారిశ్రామికవేత్తలకు సరికొత్త ఉపాధి అవకాశం లభిస్తుందని సీఎఫ్టీఆర్ఐ వర్గాలు పేర్కొన్నాయి.