వందేండ్ల చెట్లకు చిరాయువు
వందల ఏండ్ల చరిత్ర కలిగిన వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్ ద్వారా తిరిగి నాటుతూ వాటి ఉనికిని నిలుపుతున్నారు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్. వట ఫౌండేషన్‌తో కలిసి మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని 5 పెద్ద వృక్షాలను ఆదివారం ట్రాన్స్‌లొకేషన్ ద్వారా కేసీఆర్ అర్బన్ పార్కులో
ఎంపీ సంతోష్‌కుమార్, వట ఫౌండేషన్ సహకారం
పాలమూరు కేసీఆర్ అర్బన్ పార్కులో ఏర్పాటు
చెట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ / హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): వందల ఏండ్ల చరిత్ర కలిగిన వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్ ద్వారా తిరిగి నాటుతూ వాటి ఉనికిని నిలుపుతున్నారు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్. వట ఫౌండేషన్‌తో కలిసి మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని 5 పెద్ద వృక్షాలను ఆదివారం ట్రాన్స్‌లొకేషన్ ద్వారా కేసీఆర్ అర్బన్ పార్కులో నాటించారు. ఆర్అండ్బీ అతిథి గృహం స్థలంలో అధునాతన వెజ్, నాన్‌వెజ్ మారెట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో అకడ ఉన్న వందల ఏండ్ల వృక్షాలను తొలగించాల్సి వచ్చింది. దీంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పర్యవేక్షణలో ఆ వృక్షాలను భారీ క్రేన్ల సాయంతో ట్రాన్స్‌లొకేట్ చేశారు. వాటిలో మూడు పెద్ద వేపచెట్లు, కొండమల్లె, వెలగపండ్ల చెట్లు ఉన్నాయి.
చెట్ల తొలగింపు ప్రక్రియను నాలుగు రోజుల ముందు నుంచే ప్రారంభించారు. నలుగురు నిపుణుల పర్యవేక్షణలో పది మంది కూలీలు పని పూర్తి చేశారు. చెట్ల చుట్టూ 5 ఫీట్ల లోతు తవ్వి మట్టిని తొలగించి, క్రేన్ సాయంతో చెట్టును లారీలోకి ఎక్కించి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేసీఆర్ అర్బన్ పార్కుకు తరలించినట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సహకారం అందించిన ఎంపీ సంతోష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వృక్షాల ట్రాన్స్లొకేషన్లో పాలుపంచుకొన్న కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ప్రజారోగ్య ఈఈ విజయభాస్కర్, ఇతర ఇంజినీరింగ్ అధికారులను మంత్రి అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

