రైల్వే భూములకు కేంద్రం టెండర్

- మౌలాలిలో 21.51 ఎకరాల లీజుకు నోటిఫికేషన్
- త్వరలో చిలుకలగూడలో 18 ఎకరాలకు కూడా
- ఇప్పుడేమంటారు రాష్ట్ర బీజేపీ నాయకుల్లారా!
- రాష్ట్ర ప్రభుత్వం భూములమ్ముతుంటే గగ్గోలు
- అదే పని కేంద్రం చేస్తుంటే నోరెత్తని నేతలు
- నిరుపయోగ భూములే అమ్ముతున్న రాష్ట్రం
- లక్షలమంది ఆధారపడిన సంస్థ భూములను ప్రైవేటుకు ఇచ్చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
ఇప్పటికే ఎన్నో భారీ ప్రభుత్వ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన మోదీ ప్రభుత్వం.. పేదోడి జీవనాడి అయిన రైల్వేను ప్రైవేటుపరం చేసేందుకు రైలంత వేగంతో పరుగెడుతున్నది. అధిక లాభాలార్జిస్తున్న అనేక మార్గాల్లో ప్రైవేటుకు తలుపులు తెరిచిన కేంద్రం, తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ఆస్తులను లీజు పేరుతో ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నది. ఇప్పటికే 13 రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టింది. మన రాష్ట్రంలో కూడా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విలువైన భూములను దీర్ఘకాలంపాటు లీజుపేరుతో కరిగించేస్తున్నది. ప్రజా సంక్షేమం కోసం నిరుపయోగంగా ఉన్న భూములను రాష్ట్రప్రభుత్వం అమ్మాలని ప్రయత్నిస్తే నానా యాగీ చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్వాకంపై మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన సికింద్రాబాద్ పరిధిలోని భూముల లీజు ప్రక్రియను కేంద్రం మొదలుపెట్టింది. మౌలాలి ప్రాంతంలోని 21.51 ఎకరాల స్థలాన్ని ప్రైవేటుకు లీజుకు ఇవ్వడానికి రైల్వే అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు. టెండర్ దాఖలుకు ఆగస్టు 18 వరకు గడువు ఇచ్చారు. కమర్షియల్ కోసం కనీసం 45 ఏండ్లు, రెసిడెన్షియల్ కోసం 99 ఏండ్లకు లీజుకు ఇస్తున్నారు. చిలకలగూడ ప్రాంతంలో 18ఎకరాల స్థలాన్ని ప్రైవేటుకు లీజుకు ఇవ్వడానికి టెండర్లు పిలువబోతున్నారు. రైల్వేనిలయం ఎదురుగా ఉన్న మూడెకరాల రైల్వే స్థలాన్ని, మెట్టుగూడలోని రైల్వే క్వార్టర్స్‌ను కూడా లీజు పేరిట ప్రైవేటుకు ఇచ్చేందుకు నిర్ణయించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ తదితర పెద్దస్టేషన్ల పరిధిలోని స్థలాలపైనా అన్వేషణ సాగుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో కూడా ఇదేరీతిన స్థలాల లీజుకు సర్వే మొదలైంది.
కిక్కురుమనని టీ-బీజేపీ
కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్వాకంపై తెలంగాణ బీజేపీ నేతలు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. తెలంగాణపైనా ఆ ప్రభావం పడింది. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ ఆధీనంలోని నిరుపయోగ భూములను విక్రయించాలని నిర్ణయించి, అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఉమ్మడి ఏపీలోనూ తెలంగాణలోని విలువైన భూములను వేలంవేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకోసం భూములను విక్రయించేందుకు యత్నిస్తుంటే అవాకులు చెవాకులు పేలుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. కేంద్రం చేస్తున్న పనిపై ఏం సమాధా నం చెప్తారన్న ప్రశ్నలు వెలువడుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

