జెర్రి విషంలో ఔషధ గుణం!
వందకు పైగా కాళ్లు, చూడగానే ఒళ్లు గగుర్పాటు కలిగించే విధంగా ఉండే కీటకం జెర్రి విషంలో ఔషధ గుణాలు ఉంటాయని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొన్నారు.
- సీసీఎంబీ పరిశోధకుల వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): వందకు పైగా కాళ్లు, చూడగానే ఒళ్లు గగుర్పాటు కలిగించే విధంగా ఉండే కీటకం జెర్రి విషంలో ఔషధ గుణాలు ఉంటాయని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొన్నారు. వర్షాకాలం, తడి నేలల్లో ఎక్కువగా కనిపించే ఈ విషపురుగులో పలు వ్యాధులను నయంచేసే గుణం ఉన్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. జెర్రి తన సంతానాన్ని రక్షించుకొనేందుకే విషాన్ని ప్రయోగిస్తుందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 3,200కుపైగా శతపాది (జెర్రి) జాతులకు చెందిన జీవులు ఉన్నాయని, వీటిలో న్యూరోటాక్సిక్, సైటో టాక్సిక్ ప్రొటీన్లు, పప్టైడ్ల కాక్టెయిల్ ఉంటుందని పరిశోధకులు తెలిపారు. జెర్రీ కాటుతో మనుషుల్లో చలి జ్వరం, బలహీనత, వాపు, చర్మ సమస్యలు, ఎలర్జీ, రక్తస్రావం, తీవ్రమైన నొప్పి వంటి రుగ్మతలు వస్తాయని, అయితే మరణాలు అరుదుగా సంభవిస్తాయని పేర్కొన్నారు.
అదే సమయంలో ఆ విషంలో కణతులు, దగ్గు, గజ్జి, గుండె సంబంధిత వ్యాధులను కట్టడి చేసేందుకు అవసరమైన రసాయనిక మిశ్రమాలు ఉన్నాయని తెలిపారు. ఇందుకు శాస్త్రీయ, చారిత్రక ఆధారాలు ఉన్నాయని అన్నారు. చరక సంహితలో శతపాది విష గుణాల గురించి రాసి ఉందని, చైనా సంప్రదాయ వైద్యంలోనూ జెర్రి విషాన్ని ఉపయోగిస్తారని తెలిపారు. ఆ ఔషధ గుణాల తీవ్ర ఎంత తెలుసుకొనేందుకు మరింత లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

