Vikarabad | బతికున్న మనిషిని చంపేశారు.. అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తిరిగొచ్చిన వ్యక్తి
చిన్న పొరపాటుతో బతికున్న మనిషిని ‘చంపేశారు’!. చనిపోయాడని మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమవుతుండగా అసలైన వ్యక్తిని బతికేఉన్నానని వచ్చాడు.
- బతికుండగానే అంత్యక్రియలు
- కుటుంబసభ్యుల రోదనల మధ్య నడిచొచ్చిన ఎల్లప్ప
- సెల్‌ఫోన్ చోరీ.. రైలుకింద పడి మృతిచెందిన దొంగ
- ఎల్లప్పే చనిపోయాడనుకున్న పోలీసులు, కుటుంబీకులు
- చివరి నిమిషంలో వ్యక్తి ప్రత్యక్షం.. ఆనందంలో కుటుంబం
- వికారాబాద్ జిల్లాలో ఘటన
Vikarabad | బషీరాబాద్, జూన్ 23 : చిన్న పొరపాటుతో బతికున్న మనిషిని ‘చంపేశారు’!. చనిపోయాడని మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమవుతుండగా అసలైన వ్యక్తిని బతికేఉన్నానని వచ్చాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నంవాద్గిలో ఆదివారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నంవాద్గికి చెందిన పిట్టల ఎల్లప్ప (40) పీఏసీఎస్ వైస్‌చైర్మన్ అజయ్‌ప్రసాద్ వద్ద వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. రెండు రోజుల కిందట తాండూరుకు వెళ్తానని భార్య ఇమలమ్మకు చెప్పి వెళ్లాడు. తాండూరుకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవటంతో ఆమె ఆందోళన చెందింది. తెలిసినవారు, ఇరుగుపొరుగు వారిని వాకబు చేసినా ఫలితం లేదు. అయితే వికారాబాద్ రైల్వే పోలీసుల నుంచి గ్రామానికి చెందిన నర్సిరెడ్డికి శనివారం ఓ ఫోన్ కాల్ వచ్చింది.
రైలు కిందపడి చనిపోయిన వ్యక్తి మొబైల్లో మీ సెల్‌ఫోన్ నంబర్ ఉన్నదని, మీరెవరు? ఏ గ్రామం? అని ప్రశ్నించారు. ఎల్లప్పనే చనిపోయాడని భావించి నర్సిరెడ్డి వివరాలు చెప్పాడు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లటానికి వికారాబాద్ రావాలని రైల్వే పోలీసులు తెలిపారు. నర్సిరెడ్డి ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలిపి.. గ్రామస్థులు, ఎల్లప్ప భార్యను తీసుకుని శనివారం వికారాబాద్‌కు వెళ్లేసరికి రాత్రి అయ్యింది. ఆదివారం ఉదయం వారు ఆ మృతదేహాన్ని చూడగా గుర్తుపట్టలేనివిధంగా ఉండటంతో సరిగా పోల్చుకోలేకపోయారు. పోస్టుమార్టం అనంతరం రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుటుంబీకులకు అందించారు. అప్పటికే బంధువులు, గ్రామస్థులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు.
మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. ఎల్లప్ప తాండూరులో కనిపించాడని తెలిసినవారు ఫోన్ చేసి చెప్పటంతో అంతా షాకయ్యారు. ఈ విషయాన్ని ఎల్లప్పకు తెలియటంతో హూటాహుటిన గ్రామానికి వచ్చాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎల్లప్ప మొబైల్‌ను గుర్తుతెలియని వ్యక్తి తస్కరించాడు. ఆ వ్యక్తే రైలు ప్రమాదంలో మృతిచెందాడు. ఎల్లప్ప ఫోన్ రైలు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి వద్ద ఉండటంతో ఎల్లప్పే మృతి చెందినట్టు రైల్వే పోలీసులు భావించారు. దీంతో చివరికి ఖననం చేసేందుకు తీసినగుంతలో కోడిపిల్లను పూడ్చిపెట్టినట్టు గ్రామస్థులు తెలిపారు. ఎల్లప్ప తిరిగి రావటంతో భార్య, కుటుంబీకుల ఆనందం అంతా ఇంతా కాదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- cell phone theft
- Died
- theft
- Train
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

