KU | కేయూ ఉమెన్స్ హాస్టల్లో ఊడిపడిన స్లాబ్
వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ (KU) హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. వర్సిటీలోని పోతన ఉమెన్స్ హాస్టల్లోని ఓ గదిలో అర్ధరాత్రి వేల స్లాబ్ కుప్పకూలింది.
వరంగల్: వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ (KU) హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. వర్సిటీలోని పోతన ఉమెన్స్ హాస్టల్లోని ఓ గదిలో అర్ధరాత్రి వేల స్లాబ్ కుప్పకూలింది. అయితే ఆ సమయంలో గదిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హాస్టల్లో ఉండాలంటే ప్రాణాలమీదికి వస్తున్నదని, ఎన్నిసార్లు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోతున్నదని చెప్పారు. హాస్టల్ వార్డెన్‌ను నిలదీశారు.
పైకప్పు ఊడిన ఘటనపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాణిరుద్రమదేవి హాస్టల్‌ను పరిశీలించడానికి వచ్చిన రిజిస్ట్రార్ మల్లారెడ్డిని నిలదిశారు. హాస్టళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. రిజిస్ట్రార్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
కాగా, గత నెల 29న వర్సిటీ క్యాంపస్‌లోని ఉమెన్స్ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడటంతో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లూనావత్ సంధ్య అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఫ్యాన్ మీదపడంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

