అదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని రహదారిపై మంగళవారం కారు అగ్నికి ఆహుతైంది. అదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు కారులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం మంటలు వేగంగా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి..
Revanth reddy | సీఎం రేవంత్ రెడ్డి నకిలీ రైతుబిడ్డ : గండ్ర వెంకటరమణారెడ్డి
San Diego: అమెరికా మసీదులో కాల్పుల ఘటన.. శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్లో అయిదుగురు మృతి