Minister KTR | మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఇండ్ల స్థలాల అంశంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
ఇండ్ల స్థలాలు, సంబంధిత అంశాల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతున్నది.
హైదరాబాద్: ఇండ్ల స్థలాలు, సంబంధిత అంశాల పరిష్కారంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతున్నది. ఇండ్ల స్థలాలు, 58, 59 ఉత్తర్వుల కింద క్రమబద్ధీకరణ సహా సంబంధిత అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, మల్లా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదే అంశపై ఈనెల 13న కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయిన విషయం తెలిసిందే.
2023-24 వార్షిక బడ్జెట్లో సొంత స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.7350 కోట్లు కేటాయించింది. కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందించనున్నది. ఈ ఏడాది మొత్తం 4 లక్షల మంది లబ్ధిదారులకు సాయం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1,78,200 మందికి, పట్టణ ప్రాంతాల్లో 2,21,800 మంది చొప్పున సాయం అందిచనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

