నేడు క్యాబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గం గురువారం భేటీ కానున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో అదనపు నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
- అదనపు వనరుల సమీకరణపై చర్చ
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గం గురువారం భేటీ కానున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో అదనపు నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రుణాలు సమీకరించుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా తెలంగాణను కేంద్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అదనపు వనరులను ఏవిధంగా సమీకరించా లన్న దానిపై మంత్రివర్గం చర్చించను న్నది.
దీంతోపాటుగా వృద్ధాప్య పింఛన్ల వయసు 57 ఏండ్లకు తగ్గింపు, డయాలసిస్ పేషంట్లకు ఆసరా, ఆనాథ పిల్లల సంరక్షణకు పాలసీ, స్వతంత్య్ర వజ్రోత్సవాల వేళ సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీల విడుదల, తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశమున్నది. ఈ నెల 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణ, మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- cabinet meet
- CM KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

