KTR | జాతీయ పార్టీలకు 16 ఎంపీలిస్తే ఏం ఒరిగింది?.. బీజేపీకి రాష్ట్ర ప్రజలు తప్పక బుద్ధిచెప్తరు: కేటీఆర్
తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకిస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు దకిన నిధులను చూసైనా ఆలోచన చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
- ఏపీ, బీహార్‌కు దక్కిన నిధులను చూసైనా
- తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి
- స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు రక్ష
- బడ్జెట్లో ఏపీకి అధిక నిధులపై బాధ లేదు..
- తెలంగాణ ప్రస్తావనే లేకపోవడం శోచనీయం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
KTR | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకిస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు దకిన నిధులను చూసైనా ఆలోచన చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. పార్లమెంట్లో గులాబీ కండువా కప్పుకొన్న ఎంపీలు ఉండి ఉంటే కేంద్ర వివక్షను గట్టిగా వ్యతిరేకించేవారని, 8 మంది ఎంపీలనిచ్చినా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ‘పెద్ద గుండు సున్నా’ పెట్టిందని, ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని దుయ్యబట్టారు.
కేంద్ర బడ్జెట్‌పై మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలంగాణకు ఏమైనా నిధులు కేటాయిస్తారని ఆశించామని, కానీ రాష్ర్టానికి దకింది శూన్యమని పెదవి విరిచారు. రూ.48.21 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినా కొన్ని రాష్ర్టాలకే పెద్దపీట వేశారని విమర్శించారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావనే లేకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీలపైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారని, అనేకసార్లు లేఖలు రాశామని గుర్తుచేశారు. ములుగు గిరిజన యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని చెప్పారు.
జాతీయ హోదాపై పట్టించుకోలే
రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు జాతీయహోదా కల్పించాలని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం పట్టించుకోలేవటం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐఐఎం సహా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలు ఇవ్వాలని కోరినా ఒకటీ నెరవేర్చలేదని, తెలంగాణ నుంచి ముంబై – నాగపూర్, బెంగళూరు- చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినా స్పందన లేదని, మెగా పవర్ లూమ్ క్లస్టర్‌తో పాటు కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
ప్రాంతీయ శక్తుల బలోపేతం అవసరం
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు అధిక నిధులు కేటాయించారని, ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో ఈ బడ్జెట్ ద్వారా అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పార్లమెంట్లో రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉండి ఉంటే కేంద్ర వైఖరిని నిలదీసేవారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నిధులు ఇచ్చినందుకు బాధలేదని, సోదర రాష్ట్రంగా వారు బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పినా ఎకడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు.
తెలంగాణకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదు
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదని మంగళవారం ఉదయమే కేటీఆర్ చెప్పారు. ఈ సారి బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు ఎలా ఉంటాయని ఓ జర్నలిస్ట్ అడుగగా కేటీఆర్ ‘ఈ సారి కూడా కేంద్ర బడ్జెట్లో అదే పరిస్థితి ఉంటుంది. మళ్లీ కేటాయింపులు సున్నానే అని సమాధానమిచ్చారు. కేంద్రంలో గెలిచే పార్టీకి ఓటేస్తే రాష్ర్టానికి మంచి జరుగుతుందని భావించే బీజేపీకి 8 సీట్లు ఇచ్చారని చెప్పారు. ‘ఈ ప్రాంత ప్రజల కోసం బీజేపీ ఎంపీలు మోదీతో మాట్లాడి ఏం మేలు జరిగేలా చేస్తారో వేచి చూడాలి. ఎప్పటిలాగే తెలంగాణకు ఈ బడ్జెట్లో గుండుసున్నానే’ అని ఎద్దేవాచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

