గుంటూరులో గులాబీ భవన్
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, టీడీపీలకు బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజలను నమ్మించి వంచించడంలో టీడీపీ, వైసీపీ ఒకదాన్ని మించి ఒకటి పోటీపడుతున్నాయని విమర్శించారు.
- అట్టహాసంగా బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
- వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
- పటాకులు కాల్చి సంబురాలు.. పార్టీలో పలువురి చేరిక
- అంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే
- ప్రధాని మోదీని ఎదుర్కొనే సత్తా కేసీఆర్‌కే ఉన్నది
- రానున్న రోజుల్లో రాష్ట్రంలో పార్టీదే కీలక భూమిక
- బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
గుంటూరు, మే 21 ( నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, టీడీపీలకు బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజలను నమ్మించి వంచించడంలో టీడీపీ, వైసీపీ ఒకదాన్ని మించి ఒకటి పోటీపడుతున్నాయని విమర్శించారు. ఆదివారం ఆయన గుంటూరు ఆటోనగర్ సమీపంలో కొత్తగా ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పూజలు నిర్వహించి అధ్యక్ష స్థానంలో ఆసీనులయ్యారు.
వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను తానే కట్టానని చెప్పుకునే చంద్రబాబు.. అమరావతిని ఎందుకు నిర్మించలేక పోయారని ప్రశ్నించారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం జగన్ అని, ఆయన రాష్ర్టాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. 31 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయకుండా మోదీకి వంగి వంగి దండాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని పేరుతో మూడు ముకలాటలు ఆడుతున్న జగన్ ఆటలను బీఆర్ఎస్ సాగనివ్వదని చెప్పారు. ‘మోదీ అంటే జగన్‌కు కేసుల భయం.
చంద్రబాబు మోదీతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ మాత్రమే మోదీని దీటుగా ఎదుర్కోగలరు. మోదీని నిలదీసే సత్తా.. దేశానికి నాయకత్వం వహించే సత్తా కేసీఆర్‌కే ఉన్నది’ అని స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ పథకాలు రూపొందించారని, ఏపీలోనూ వాటిని అమలు చేస్తామని చెప్పారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ ఏపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా రూపొందించడంలో కేసీఆర్, కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏపీకి సమర్థ నాయకత్వం లేకపోవడం వల్లనే అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ఒక్క నగరం కూడా అభివృద్ధి చెండదం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్లో చేరిన ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు, ప్రైవేటు ఉద్యోగుల సంఘం నాయకులు తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ప్రైవేటు ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు గంధం రాములు ఆధ్వర్యంలో ఏపీ కమిటీ సభ్యులు విజయలక్ష్మి, మాగంటి సత్య, ప్రసాద్, సురేశ్, రాకేశ్, మస్తాన్‌వలీ, ఉమేశ్, బాలినేని ప్రభాకర్‌రెడ్డి తదితరులు బీఆర్ఎస్లో చేరారు. భారత ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఏపీ రాష్ట్ర కమిటీ పోస్టర్‌ను తోట చంద్రశేఖర్, గంధం రాములు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదినారాయణ, డాక్టర్ గంగాధర్‌రావు, తోట సత్యనారాయణ, రమేశ్‌నాయుడు, తోట సుబ్బారావు, సోషల్ మీడియా ఇన్చార్జి మోహన్‌నాయక్, మల్లెల శ్రీనివాసరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

