KTR | మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకునే బాపతి రేవంత్ : కేటీఆర్
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకునే బాపతి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | మేడ్చల్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకునే బాపతి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తూంకుంట నుంచి జేబీఎస్ వరకు, కండ్లకోయ నుంచి ప్యాట్నీ వరకు స్కైవే నిర్మిస్తామని, 100 ఎకరాలు రక్షణ భూములు ఇవ్వాలని ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిస్తే లాభం లేకుండా పోయింది. చివరకు గతేడాది ఆగస్టులో తెలుగు అధికారి గిరిధర్‌ను.. నేను మంత్రిగా, సీఎస్ శాంతి కుమారి వెళ్లి కలిసి స్కైవేలపై చర్చించాం. ఆయన పుణ్యమా అని మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది. ఆ ఆర్డర్ బీజేపీ, కాంగ్రెస్ వల్ల ఏం రాలేదు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకునే బాపతి రేవంత్ రెడ్డి. ఎందుకంటే.. 100 రోజుల్లో స్కైవే నిర్మాణాలకు ఆర్డర్ నేనే తెచ్చాను అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటుండు. చెప్పుకునేందుకు ఇజ్జత్ ఉండాలి. కనీసం ఆలోచన ఉండాలి. ఒక ఫైల్ రావాలంటే నెలలు పడుతుంది. ఆగస్టులో పని అయిపోయింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల కోడ్ కారణంగా.. మొన్న ఆర్డర్ వచ్చింది. మీరు గెలుస్తరు అనుకోలేదు. మేం ఓడుతామని అనుకోలేదు. కానీ అదృష్టం బాగుండి రేవంత్ సీఎం అయ్యారు. కానీ పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. నిన్న మొన్నటి దాకా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేసిండు. కేంద్రంతో కేసీఆర్ పంచాయితీ పెట్టుకున్నాడు కాబట్టి స్కైవేలకు అనుమతి ఇవ్వలేదు.. నేను మంచిమాట చెబితే ఇచ్చారని రేవంత్ రెడ్డి డైలాగులు కొడుతున్నారు. కానీ వాస్తవం రేవంత్‌కు తెలుసు. కాగితం నీ చేతికొచ్చే వరకు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నావు అని రేవంత్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు.
మన గవర్నమెంట్లో ఒక లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కానీ చెప్పడంలో ఫెయిలయ్యాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటుండు. మరి నువ్వు వచ్చిన తర్వాత ఎన్నినోటిఫికేషన్లు ఇచ్చావు.. ఎన్ని పరీక్షలు పెట్టావు. కేసీఆర్ హయాంలో 30 వేల ఉద్యోగాలు ఇస్తే.. వాటికి కాగితాలు ఇచ్చి నేనే ఇచ్చానని చెప్పుకుంటున్నావు. ఇలా ఇచ్చి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకుంటుకున్నావు. కాంగ్రెసోళ్లు పచ్చి మోసగాళ్లు.. రెండు లక్షల ఉద్యోగాలు ఒకే ఏడాదిలో ఇస్తానని చెప్పాడు. తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు అమాయకులు కాదు.. 30 వేల ఉద్యోగాలు నీ ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అది కేసీఆర్ ఖాతాలోకి వెళ్తుంది. మాటిచ్చిన ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- KCR
- KTR
- malkajgiri
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

