KTR | రాష్ట్రంలో రాజ్యాంగ హననం.. భయానక పరిస్థితులు: కేటీఆర్
రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించకపోవడం తదితర అంశాలపై కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం గవర్నర్ రాధాకృష్ణన్‌కు శనివారం రాజ్‌భవన్‌లో కలిసి ఫిర్యాదు చేసింది.
- ఫిరాయింపులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం..రాష్ట్రపతికీ ఫిర్యాదు చేస్తాం
- నిరుద్యోగులకిచ్చిన హామీల అమలు లేదు.. ప్రొటోకాల్ పాటింపు లేదు
- రాష్ట్రంలో భయానక పరిస్థితులు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం
KTR | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించకపోవడం తదితర అంశాలపై కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం గవర్నర్ రాధాకృష్ణన్‌కు శనివారం రాజ్‌భవన్‌లో కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు వెల్లడించారు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడం, ప్రతిపక్ష నియోజకవర్గాల్లో ఎక్కడా ప్రొటోకాల్ పాటించకపోవడం వంటి అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. నిరుద్యోగ యువత, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొకుతున్నారో గవర్నర్‌కు వివరించామని చెప్పారు. హామీలు అమలుచేయాలని కోరుతున్న విద్యార్థుల మీద నిర్బంధం, అణచివేత, అరెస్ట్‌లు, అక్రమ కేసులతో భయానక వాతావారణం పునరావృతం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అంటూ ప్రచారం చేశారని, వాటిని అమలు చేయడంలేదని దుయ్యబట్టారు.
సిటీ సెంట్రల్ లైబ్రరీలో లాఠీచార్జి, ఉస్మానియా యూనివర్సిటీ హస్టల్లో ఉన్న విద్యార్థులపై దాడి చేస్తూ ఉద్యమకాలం నాటి అణచివేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రయోగిస్తున్నదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. గ్రూప్-1,2,3 పోస్టులను పెంచుతామంటూ ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడం, మెగా డీఎస్సీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలుచేయని విషయాన్ని గరవ్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఆయా అంశాలపై గవర్నర్ చాలా సీరియస్‌గా స్పందించారని, హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని హామీ ఇచ్చారని వెల్లడించారు. విద్యార్థుల మీద ఈవిధంగా జరగడం మంచిది కాదని గవర్నర్ అన్నారని కేటీఆర్ చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ పార్టీ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎనిమిది మంది ఎమ్మెల్సీలను చేర్చుకున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని, స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశామని వివరించారు. బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీచేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. నిరుద్యోగుల విషయంలో గవర్నర్ చాలా సీరియస్‌గా స్పందించిన తీరును అభినందిస్తున్నామని, స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ పార్టీగా అండగా ఉంటుందని, వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేవరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు
త్వరలో మేడిగడ్డకు…
మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు గంగపాలు అయ్యిందంటూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అకడ జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కొన్నిరోజుల్లోనే రిపేర్లు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇప్పుడు గోదావరికి వరద వస్తున్నా మేడిగడ్డ తట్టుకున్నదంటే అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనమేనని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తామని, ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని చెప్పారు. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు రూ.వందల కోట్లు లాభం వస్తుందని సీఎం అన్నారని, ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారని, రూ.నాలుగు వందల కోట్లు వస్తున్నాయా? అందులో సీఎం వాటా ఎంత? అని ప్రశ్నించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు టీ హరీశ్‌రావు, మహమూద్‌అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేపీ వివేకానంద, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కోవ లక్ష్మి, పాడి కౌశిక్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, అనిల్‌జాదవ్, చింతా ప్రభాకర్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు ఎస్ మధుసూదనాచారి, ఎల్ రమణ, నవీన్‌కుమార్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, శంభీపూర్ రాజు, దేశపతి శ్రీనివాస్, వాణీదేవి, పొచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రొటోకాల్ ఉల్లంఘన
ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా గవర్నర్‌కు వివరించామని కేటీఆర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అగౌరవపర్చడం, అధికారుల తీరు, ప్రజాప్రతినిధుల హకులకు భంగం వాటిల్లుతున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. దీనిపై కూడా ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ లేఖ రాస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని చెప్పారు. భవిష్యత్తులో విపక్షాలుగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కలవాలని గవర్నర్ సూచించారని తెలిపారు. తన పరిధిలో ఉన్న అంశాల్లో తప్పకుండా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్టు రాహుల్‌గాంధీ పోజులు కొడుతూ.. రాజ్యాంగాన్ని తుంగలో తొకుతున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

