BRS | మెడలో మిర్చి దండలు వేసుకుని.. మండలి ఆవరణలో బీఆర్ఎస్ వినూత్న నిరసన
మెడలో మిర్చి దండలు వేసుకుని శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, రూ.25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: మెడలో మిర్చి దండలు వేసుకుని శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, రూ.25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయిందని, సరైన ధర లేకపోవడంతో ప్రస్తుత సీజన్లో 2లక్షల 40 వేల ఎకరాలల్లో పంట సాగయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెవాలని, మిర్చి మద్దతు ధర క్వింటాల్కు రూ.25 వేల నిర్ణయించి నాఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.
తెలంగాణ సాగుచేసిన మిర్చి పంటను విదేశాలకు ఎగుమతిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలిలో విపక్ష నేత మధుసూదనా చారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు కవిత, నవీన్ కుమార్, తాతా మధు, మహమూద్ అలీ, నవీన్ కుమార్ రెడ్డి, వాణి దేవి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

