ప్రజాపాలనా పర్సెంటేజీల పాలనా?
ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన నడుస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, కమీషన్ల దందా విచ్చలవిడిగా పెరిగిపోయిందని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే బట్టబయలు చేశారని పేరొన్నారు.
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్
- రూ.5 లక్షల రోడ్డు బిల్లులో 20% కమీషన్లకే
- ప్రజలకు దకే పని విలువ కేవలం 2.5 లక్షలే
- సర్కార్ అవినీతిపై ఎమ్మెల్యే వేసిన చార్జ్‌షీట్ ఇది
- అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం స్పందించాలి
- అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలి
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన నడుస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, కమీషన్ల దందా విచ్చలవిడిగా పెరిగిపోయిందని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే బట్టబయలు చేశారని పేరొన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ, సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే సమాధానం చెప్పాలని మంగళవారం వీడియో సందేశం ద్వారా డి చేశారు. ఇది బీఆర్ఎస్ లేదా ఇతర ప్రతిపక్షాలు వేసిన చార్జ్‌షీట్ కాదని, కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేనే ప్రభుత్వ అవినీతి పాలనపై చేసిన చార్జ్‌షీట్‌గా అభివర్ణించారు.
కమీషన్ల లెకతో 50శాతం ప్రజాధనం వృథా
ఒక సాధారణ 5 లక్షల సిమెంట్ రోడ్డు బిల్లు మంజూరు కావాలంటే ఎం-బుక్ రికార్డింగ్ దశలోనే అధికారులు 10నుంచి 20 శాతం వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చెప్పిన అంశాన్ని శ్రవణ్ విశ్లేషించారు. ఇందులో 20 శాతం కమీషన్ అధికారులు, మధ్యవర్తుల వద్దకు వెళ్తుండగా, 30 శాతం కాంట్రాక్టర్ మనుగడ, లాభం కోసం పోతున్నదని, ఫలితంగా 5 లక్షల ప్రజాధనంలో అసలైన నిర్మాణ పని కోసం ఖర్చయ్యేది కేవలం 50శాతం (2.5 లక్షలు) మాత్రమేనని ఆరోపించారు. సొంత ఎమ్మెల్యేనే కమీషన్ దందా గురించి చెప్పడంతో ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తోందో, ఏ రాష్ట్ర ఎన్నికలకు తరలిస్తున్నారో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా సాగుతున్న ఈ వసూళ్ల వైఖరి వల్ల రాష్ర్టానికి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రికి బాధ్యత ఉంటే వెంటనే సొంత ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించి ఏసీబీ విచారణకు ఆదేశించాలని, ఈ కమీషన్ల పాలనకు ముగింపు పలుకాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

