MLA Laxma Reddy | రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్‌మెయిలర్.. టీపీసీసీ చీఫ్‌పై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫైర్
MLA Laxma Reddy | టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్‌మెయిలర్ అని విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన 100 పడకల ఆస్పత్రిని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
MLA Laxma Reddy | టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్‌మెయిలర్ అని విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన 100 పడకల ఆస్పత్రిని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి నిర్మించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ ఆస్పత్రిలో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. డయాలసిస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల అద్దంలా మెరిసిపోతుందని అన్నారు. ఈ అభివృద్ధిని చూసి కొంతమంది మూర్ఖులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా విలువను రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నాడని సీరియస్ అయ్యాడు. రేవంత్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాల్లేనని అన్నారు. రాజకీయాలను ఆయన భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. అసలు మిడ్జిల్‌కు ఏం చేశాడో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. బీజేపీ నాయకులు తమ కల్లోలాలు రేపి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | ప్రజల సొమ్ముతో రేవంత్ ఫుట్‌బాల్..తనను కోసినా రూపాయిలేదన్న సీఎం వ్యాఖ్యలపై సెటైర్లు
Revanth Reddy | సీఎం సభ అట్టర్‌ఫ్లాప్.. రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగానే సభ నుంచి వెళ్లిపోయిన జనం
Revanth vs Raja Gopal Reddy | రేవంత్ వర్సెస్ రాజగోపాల్.. రెండు రోజులుగా సీఎంను టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
Revanth Reddy | మొగోళ్లు బెల్ట్‌షాప్‌కు పోతే ఆడోళ్లు సభకు వచ్చిండ్రు.. ఇంటి పెద్దలను అవమానించేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు
5 లక్షల కోట్ల అవినీతి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

