Million March | మిలియన్ మార్చ్‌కు నేటితో 14 ఏళ్లు పూర్తి.. నాటి ఘట్టాన్ని గుర్తుచేసుకున్న కేటీఆర్, హరీశ్‌రావు
Million March | తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన మిలియన్ మార్చ్‌కు నేటితో 14 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు నాటి సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
Million March | తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన మిలియన్ మార్చ్‌కు నేటితో 14 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు నాటి సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ పాలకుల ఆంక్షలకు తట్టుకొని.. నిర్భంధాలకు ఎదురొడ్డి.. అరెస్టులను ఎదురించి.. లక్షలాది తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ట్యాంక్ బండ్‌పై గర్జించిన అపురూప సన్నివేశాలు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతున్నాయని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో వివిధ పోరాట రూపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు జోహార్.. జై తెలంగాణ అని వ్యాఖ్యానించారు.
‘మిలియన్ మార్చ్’తో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ సందర్భమని హరీశ్‌రావు అన్నారు. ఆంక్షల పద్మవ్యూహాన్ని బద్దలుకొట్టుకుని లక్షలాదిగా జనం తరలివచ్చారని గుర్తుచేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ ప్రస్థానంలో అదో కీలక ఘట్టమని వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవమని అన్నారు. ఆంక్షలు, నిర్బంధాల కట్టడిని చిత్తడి చేసి జలమార్గం గుండా టాంక్ బండ్ చేరుకొని, మిలియన్ మార్చ్ లో పాల్గొని నేటికీ 14 ఏళ్లు పూర్తయ్యాయని అన్నారు. ఆ అపురూప దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయని చెప్పారు. నాటి ఉద్యమ పోరాటాలు ఇంకా రగిలిస్తూనే ఉన్నాయని అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి సెల్యూట్ అని అన్నారు. ప్రాణాలు సైతం అర్పించిన అమరులకు జోహార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

