జానయ్యపై చర్యలకు జాప్యమెందుకు?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్యను వెంటనే విధుల నుంచి తొలగించాలని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- మహిళా ప్రొఫెసర్లను వీసీ వేధిస్తున్న ఉదంతంపై సీఎం స్పందించాలి
- ఆరోపణలపై విచారణ జరిపించాలి
- మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత డిమాండ్
- వీసీపై చర్య తీసుకునేదాకా పోరాటం
- ఉద్యోగ, విద్యార్థి సంఘాలు వెల్లడి
- అరెస్టులకు భయపడబోం: కార్తీక్‌రెడ్డి
- బాధితురాలికి మద్దతుగా నిరసనలు
- కేసును నీరుగార్చేందుకు కుట్ర: తేజశ్రీ
వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 10 : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్యను వెంటనే విధుల నుంచి తొలగించాలని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలని, వేధింపుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై అసభ్యంగా వ్యవహరించిన వీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం విశ్వవిద్యాలయ ప్రాంగణమం తా బాధితురాలైన అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు మద్దతుగా బీఆర్ఎస్, ఏబీవీపీ, వర్సిటీ విద్యార్థులు, ప్రజాసంఘాలు, అధ్యాపకులు, వివిధ విద్యా ర్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి.
ఇప్పటివరకు వీసీపై చర్యలు తీసుకోకపోవడమేందని మండిపడ్డారు. అరాచక వీసీని విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు నినదించారు. వీసీ మద్దతుదారులు కొందరు అక్కడే కలియదిరుగుతూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారు. రేవంత్‌రెడ్డి పాలన లో మహిళలకు, ఆడపిల్లలకు రక్షణ కరువైంద ని, గవర్నర్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి 16రోజులైనా స్పందించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థి సం ఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. వీసీని వెంటనే తొలగించి, బాధితురాలికి న్యాయం చేయాలని తెలంగాణ సైంటిస్ట్ అసోసియేషన్ (టాసా), విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ కన్నీంటిపర్యంతం
‘వీసీ తండ్రిలాంటి వారు అనుకున్నా. అత ని క్రూరత్వం చాలా రోజులకు బయటపడింది’ అని బాధితురాలైన అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ మాజీ మంత్రులు, మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. లొంగకపోతే కెరీర్‌ను నాశ నం చేస్తానని వీసీ బెదిరించారని, తనను వేరే చోటికి బదిలీ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అగ్రి వర్సిటీలోనే చదివానని, ఇక్కడే 2014 నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నానని, తండ్రిలా భావించిన జానయ్య ఇలాంటి నీచుడని ఇటీవల బయటపడిందని తెలిపారు. చెప్పకోలేని రీతిలో లైంగి క వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించా రు. 8 నెలలుగా మానసికంగా కుంగిపోయాన ని, తప్పని పరిస్థితుల్లోనే ఉమెన్వింగ్, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని, తనకు న్యాయం జరిగే వరకు విడిచిపెట్టేదే లేదని, కేసును నీరు గార్చేందుకు వీసీ జానయ్య కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

న్యాయం జరిగేవరకు పోరాడుతాం : పట్లోళ్ల
వీసీ పెంచి పోషిస్తున్న వారికి, పోలీసులకు తాము బయపడబోమని, తేజశ్రీకి న్యాయం జరిగేవరకు పోరాడుతామని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి స్పష్టంచేశారు. అరాచకాలకు పాల్పడుతున్న వీసీ జానయ్యను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న మద్దతు
అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ న్యాయమైన పోరాటానికి రోజురోజుకూ వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. వీసీ అనుచరులు ఎంత కట్టడిచేసినా వీసీ అరాచకాలకు బలైన వారు బయటకొస్తూ, తేజశ్రీకి మద్దతు తెలుపుతున్నారు. స్వచ్ఛందంగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి బయటికొస్తుండగా వీసీ మద్దతుదారులు కొందరు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారు. విద్యార్థి సం ఘాల నాయకుడు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున రావడాన్ని చూసి ఆయన్ను పోలీసులు అరెస్టుచేశారు. నిరసన లో టాసా నాయకులు డాక్టర్ చల్లా సౌజన్య, పవన్ చంద్రారెడ్డి, అమృత్‌రెడ్డి, డాక్టర్ సునీత, ప్రశాంత్, కమలాకర్, జయరాజ్, విద్యార్థి సం ఘాల నాయకులు కృష్ణమూర్తి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. వీసీ జానయ్య ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నవారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్లే వారు తేజశ్రీని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని అగ్రివర్సిటీ నాన్ టీ చింగ్ నాయకుడు శ్రీనివాస్ యాదవ్, టీచింగ్ ఉద్యోగ సంఘ నాయకులు ఆరోపించారు.
వీసీపై కేసు నమోదు చేయని పోలీసులు
బండ్లగూడ, నవంబర్ 10 : వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ జానయ్య తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. ఆమె రాజేంద్రనగర్ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఇటీవల మహిళా కమిషన్ వద్ద చేసిన ఫిర్యాదు ఎంతవరకు వచ్చిందో తెలియకుండా తాము కేసు నమోదు చేయలేమని ఇన్స్పెక్టర్ వెంకటేశ్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం వరకు ఈ కేసుకు సంబంధించి మహిళా కమిషన్ నుంచి వివరాలు తీసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆమె వెంట వచ్చిన విద్యార్థులు తమకు ఇప్పుడే కేసు నమోదు చేసి రసీదు ఇవ్వాలని కోరారు. ఓ దశలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. ఆ తర్వాత పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించివేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

