Manne Krishank | కేసీఆర్‌ను తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్ల ఖర్చు : మన్నె క్రిశాంక్
Manne Krishank | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
Manne Krishank | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
రూ. 100 కోట్లతో తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభ అజెండా ఏందంటే.. కేవలం కేసీఆర్‌ను తిట్టడమే. రాహుల్, రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్‌ను తిట్టారు. కేసీఆర్ అంటేనే రాహుల్, రేవంత్ భయపడుతున్నారు. ఇక రాహుల్ గాంధీ మళ్లీ రాసిచ్చిన స్క్రిప్టునే చదివారు. వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన రూ. 500 బోనస్, రైతుకు రూ. 15 వేల ఆర్థికసాయం వంటి హామీలను అమలు చేయలేదు. ఇప్పుడేమో తుక్కుగూడ వచ్చి కేసీఆర్ ఫోన్ ట్యాపిగ్ ఆరోపణ చేశారు రాహుల్. రైతు ఆత్మహత్యలు, ఎండిన పంటల అంశాన్ని, రైతుల డిమాండ్లను పక్కదారి పట్టించేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు.
ఓట్ల కోసం వెబ్‌సిరీస్‌గా ఫోన్ ట్యాపింగ్
ఓట్ల కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌ను వెబ్‌సిరీస్‌గా నడిపిస్తోంది. మోదీనేమో ఈడీ పేరుతో హింసిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ప్రతిపక్షాలపై బురదజల్లి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 10 లక్షల కన్వర్జేషన్స్ ట్యాపింగ్ చేశారని, దీని కోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి వాటిపై నిస్పక్షపాతంగా విచారణ చేయాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ అవసరమని మన్మోహనే చెప్పారు
సోనియా యూపీఏ చైర్‌పర్సన్‌గా, రాహుల్ ఎంపీగా ఉన్నప్పుడు, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ ట్యాపింగ్‌పై ఒక స్టేట్మెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అవసరమని మన్మోహనే చెప్పారు. మరి మన్మోహన్‌ను బద్నాం చేశారా..? మరి మేం మాట్లాడితే రేవంత్ రెడ్డి తమపై కేసులు పెట్టిస్తున్నారు. మరి రాహుల్ గాంధీకి అప్పుడు సోయి లేదా..? అప్పుడు ఎంపీగా ఉన్నారు కదా..? మరి ఇవాళ మన్మోహన్ మీద ఎందుకు విచారణ చేయలేదు. టెలింకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఫోన్ ట్యాపింగ్ విషయాలను బయటపెట్టలేమని ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఫోన్లు ట్యాపింగ్ జరిగాయా..? లేదా..? అన్నది ట్రాయ్‌ని అడగండి. మరి ఈ కేసులో ట్రాయ్, టెలికాం ప్రొవైడర్లను ఎందుకు పెట్టలేదు. ఎందుకంటే కొందర్నీ కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానం వస్తుంది. ఏది నిజమో తెలియడం లేదని మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

