Gadari Kishore | హిట్లర్ ఆదర్శమని చెప్పి.. ఆయనలా ఆత్మహత్య చేసుకోవద్దు.. రేవంత్ రెడ్డికి గ్యాదరి కిశోర్ రిక్వెస్ట్
Gadari Kishore | తనకు హిట్లర్ ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కుమార్ వ్యంగ్యంగా స్పందించారు. రేవంత్ రెడ్డి తనకు హిట్లర్ ఆదర్శమని చెబుతుంటారని తెలిపారు.
Gadari Kishore | తనకు హిట్లర్ ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కుమార్ వ్యంగ్యంగా స్పందించారు. రేవంత్ రెడ్డి తనకు హిట్లర్ ఆదర్శమని చెబుతుంటారని తెలిపారు. పాపం చదువుకోలేదు కాబట్టి ఆయన్ను తప్పుబట్టడానికి లేదని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గ్యాదరి కిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. హిట్లర్ ఆదర్శమని.. అనాలో.. అనకూడదో కూడా ముఖ్యమంత్రికి తెలియదని సానుభూతి చూపించారు.
హిట్లర్ పుస్తకం మొత్తం చదవనట్లు ఉన్నాడని.. హిట్లర్ రేవంత్ రెడ్డిలా ఇలాగే పిచ్చిపనులు చేసి, ఆగమాగమై.. మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడని గ్యాదరి కిశోర్ తెలిపారు. దయచేసి ముఖ్యమంత్రిగారూ మీరు అలాంటి పనులు చేయవద్దని సూచించారు. పిచ్చి పిచ్చి పనులు చేసి, మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. హిట్లర్ ఆదర్శమని చెప్పి.. పుసుక్కున హిట్లర్ చేసినట్టే చేసేవని వ్యాఖ్యానించారు. నువ్వు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివి కాబట్టి బాగుండాలని కోరుకుంటామని అన్నారు. నువ్వు మంది చావు కోరుకుంటావేమో కానీ.. మేం అలా కోరుకోమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రికి తెలియకుండానే సంబంధిత విభాగంలో బదిలీలు జరుగుతున్నాయని గ్యాదరి కిశోర్ తెలిపారు. టీ శాట్ను ఐటీ డిపార్ట్మెంట్ నుంచి తొలగించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసుకుని.. తనకు కావాల్సిన వ్యక్తికి ముఖ్యమంత్రి ఎక్స్టెన్షన్ జీవో ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఇది మంత్రి శ్రీధర్ బాబుకు తెలియకుండానే జరిగిందని అంటున్నారని.. అలాంటి పరిస్థితి ఎదురైతే మంత్రి పదవికి రాజీనామా చేయాలి కదా అని ఆయన ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

