నిరంతరం జలతరంగం
చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని కరువు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఇటీవల ప్రకటించారు. కోట్ల రూపాయలు వెచ్చించినా నీళ్లను కొనలేమని, ప్రతి చుక్కనూ జాగ్రత్తగా ఒడిసిపట్టి వినియోగించుకోవాలని సుద్దులు చెప్పారు.
- మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
- కన్నెపల్లి వద్ద లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు
- తద్వారా తాగునీటితోపాటు సాగుకు అవకాశం
- అయినప్పటికీ ఎత్తిపోసేందుకు సర్కార్ ససేమిరా
- ప్రత్యామ్నాయాలున్నా నివేదికల సాకుతో ప్రాజెక్టు పడావు
- ఎన్డీఎస్ఏపై నెపం.. తెలంగాణకు ద్రోహం
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): చరిత్రలోనే ఎన్నడూ కనీవినీ ఎరుగని కరువు వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఇటీవల ప్రకటించారు. కోట్ల రూపాయలు వెచ్చించినా నీళ్లను కొనలేమని, ప్రతి చుక్కనూ జాగ్రత్తగా ఒడిసిపట్టి వినియోగించుకోవాలని సుద్దులు చెప్పారు. తాజాగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్డీఎస్ఏ నివేదికలపై నెపం మోపుతూ నీళ్లను ఎత్తలేమని ప్రకటించి సర్దిచెప్పుకొనేందుకు యత్నించారు. వాస్తవానికి బీఆర్ఎస్ బృందం శనివారం మేడిగడ్డ, కన్నెపల్లి పర్యటనకు వెళ్లింది.
ఆ సమయానికి కూడా మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద 94 మీటర్ల మేర ప్రవాహం నమోదవుతున్నది. అక్కడ 93 మీటర్లు ఉంటే చాలు నీళ్లను ఎత్తవచ్చు. అంటే నీళ్లను లిఫ్ట చేసుకొనే అవకాశమున్నది. ఆ జలాలను ఒడిసి పడితే యావత్ ఉత్తర తెలంగాణతోపాటు హైదరాబాద్ తాగునీటికి పూర్తిగా భరోసా కల్పించవచ్చు. అంతేకాదు, లక్షల ఎకరాలకు సాగునీటిని కూడా అందించే అవకాశమున్నది. తద్వారా వేల కోట్ల రూపాయల విలువైన పంటలు పండటంతోపాటు రైతన్నలను కరువు బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయినప్పటికీ, ఎన్డీఎస్ఏపై నెపం మోపుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమర్ చుక్క నీరివ్వలేం, ఎత్తలేమని ఖరాకండిగా చెప్తున్నారు.
మేడిగడ్డను పూర్తిస్థాయిలో నింపకుండా, వినియోగించకుండా కేవలం అత్యంత స్వల్ప ఖర్చుతో జియోట్యూబ్ టెక్నాలజీతో కాఫర్ డ్యామ్‌ను నిర్మించడం ద్వారా, లేదంటే గేబియన్ టెక్నాలజీ ద్వారా వరద జలాలను కన్నెపల్లిలోకి మళ్లించవచ్చని నీటిరంగ నిపుణులే గతంలో తేల్చిచెప్పారు. ఎన్డీఎస్ఏ సైతం బరాజ్‌ల వినియోగం, నీటి నిర్వహణ, ఎత్తిపోసుకొనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని తేల్చిచెప్పింది. అయినప్పటికీ, ఎన్డీఎస్ఏపై నెపం మోపుతూ, ప్రాణధారలను దిగువకు వదిలిపెడుతూ కాంగ్రెస్ సర్కారే తెలంగాణను కరువు కోరల్లోకి నెడుతున్నదనే విమర్శలొస్తున్నాయి. రాజకీయాలకే పరిమితమై రైతాంగ ప్రయోజనాలను పణంగా పెడుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

