మూసాపేట, మే 22 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై ఓ యువకుడు అభిమానాన్ని చాటుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నక్క రమేశ్ తన కుడిచేతిపై కేసీఆర్ చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. శుక్రవారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు కందూరు గ్రామస్తులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఆ సమయంలో కేసీఆర్ సార్ అంటే తనకు చాలా ఇష్టమని, అందుకు అభిమాన నేత చిత్రాన్ని చేతిపై టాటూ వేయించుకున్నట్టు చెప్పాడు. దీంతో కేటీఆర్ అతడిని అభినందించారు. మీలాంటి వారందరి అభిమానంతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు.