Brazilian mayor | బ్రెసిలియా : దక్షిణ బ్రెజిల్‌లోని అరౌకారియా నగర మేయర్ హిస్సామ్ హుసేన్ దేహైనీ 65 ఏండ్ల వయసులో 16 ఏండ్ల అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ మేయర్‌కు ఇది ఆరో పెళ్లి. అయితే ఆ యువతితో పెళ్లి కాగానే.. కొత్త అత్తగారికి స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా పదోన్నత ఇచ్చేశాడు మేయర్. అయితే ఈ విషయం స్థానికంగా దుమారం రేపుతోంది.
మేయర్‌పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై బ్రెజిల్ విచారణ సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. బ్రెజిల్ చట్టాల ప్రకారం 16 ఏండ్లు దాటిన యువతులు పేరెంట్స్ అనుమతితో తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. మేయర్ తాజాగా వివాహం చేసుకున్న అమ్మాయికి 16 ఏండ్లు పడిన మరుసటి రోజే మనువాడాడు.
అయితే ఆ యువతి తల్లి స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగి. విద్యాశాఖలో పని చేస్తుంది. కానీ జీతం చాలా తక్కువ. దీంతో పెళ్లి కాగానే తన అత్తకు దేహైనీ పదోన్నతి కల్పించాడు. ఈ విషయాన్ని డిప్యూటీ మేయర్ సీమా బయటపెట్టడంతో కొత్త పెళ్లి కుమారుడు ఇప్పుడు ఇరుకున పడ్డాడు.