వామ్మో సైన్సా.. మాకొద్దు..
సైన్స్.. మానవాభివృద్ధికి మూలం. నేడు మనం అనుభవిస్తున్న సుఖాలకు..విలాసాలకు సైన్సే కారణం.
- డిగ్రీలో సైన్స్ కోర్సులకు అబ్బాయిలు నో
- ఆర్ట్స్ కోర్సుల్లోనే అత్యధిక ప్రవేశాలు
- ముగిసిన డిగ్రీ అడ్మిషన్లు
- ఈ ఏడాదిలో వివిధ డిగ్రీ కోర్సుల్లో 2.10లక్షల మంది విద్యార్థుల చేరిక
హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : సైన్స్.. మానవాభివృద్ధికి మూలం. నేడు మనం అనుభవిస్తున్న సుఖాలకు..విలాసాలకు సైన్సే కారణం. ఇలాంటి సైన్స్ మానవ జీవితంతో పెనవేసుకుపోయింది. కానీ, ఇంతటి ప్రాధాన్యం ఉన్న సైన్స్ సంబంధ కోర్సులంటేనే ఈ తరం అబ్బాయిలు జంకుతున్నారు. వామ్మో మాకొద్దంటున్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. సులభంగా ఉండే ఆర్ట్స్ కోర్సులనే ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది బీఎస్సీ బీజెడ్సీ, బయో కెమిస్ట్రీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్, బయాలజీ వంటి సైన్స్ కోర్సుల్లో అబ్బాయిల అడ్మిషన్లు 24.21శాతం మాత్రమే. అదే అమ్మాయిలు 75.59 శాతం ఈ కోర్సులనే ఇష్టపడి తీసుకొన్నారు. ఇదే తరహాలో బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్‌లో అమ్మాయిలు 55.17శాతం చేరితే, అబ్బాయిలు 44.59 శాతం ప్రవేశం పొందారు.
ఆర్ట్స్‌లో అబ్బాయిలదే ఆధిపత్యం..
ఆర్ట్స్ కోర్సుల్లో మాత్రం అబ్బాయిలదే పైచేయిగా కనిపిస్తున్నది. బీఏలో 59.56 శాతం, బీకాంలో 54.95 శాతం అబ్బాయిలే ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది మొత్తం 2.10 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందారు. మొత్తం అడ్మిషన్లలో 52.06 శాతం అమ్మాయిలే ఉండగా, 47.94 శాతం అబ్బాయిలున్నారు. కోర్సుల వారీగా తీసుకొంటే ఈ ఏడాది బీకాం కోర్సులోనే అత్యధికంగా 87వేలకు పైగా మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. డిగ్రీలో మొత్తం 4.20 లక్షల సీట్లకు ఈ ఏడాది 50శాతమే సీట్లే నిండాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

