Borlaug Dialogue | ‘బోర్లాగ్ సదస్సుకు మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డికి ఆహ్వానం..! అనుమతినిచ్చిన ప్రభుత్వం..!
Borlaug Dialogue | తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, నిరంజన్‌రెడ్డికి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ప్రపంచ హరిత విప్లవ పితాహహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీదుగా నిర్వహిస్తున్న బోర్లాగ్ ఇంటర్నేషనల్ సమావేశంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాల్సిగా సంస్థ ప్రతినిధులు మంత్రులకు సదస్సు స్వాగతం పలికింది.
Borlaug Dialogue | తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, నిరంజన్‌రెడ్డికి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ప్రపంచ హరిత విప్లవ పితాహహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీదుగా నిర్వహిస్తున్న బోర్లాగ్ ఇంటర్నేషనల్ సమావేశంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాల్సిగా సంస్థ ప్రతినిధులు మంత్రులకు సదస్సు స్వాగతం పలికింది.
ఈ నెల 24 నుంచి 26 వరకు అమెరికాలోని అయోవా రాష్ట్రం డెమోయిన్ నగరంలో సదస్సుకు హాజరుకావాల్సి ఉండగా.. కేటీఆర్, నిరంజన్‌రెడ్డి పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రపంచ హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ పేరుపై ఏటా సదస్సులు నిర్వహిస్తుండగా.. హాజరుకావాలని మంత్రి కేటీఆర్‌ను ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్’ అధ్యక్షుడు ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, పురోగతిని గమనించి.. వ్యవసాయంలో పదేళ్లలో సాధించిన ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాలని మంత్రులకు ఆహ్వానం పంపింది.
ఇక సదస్సులో ప్రపంచ వ్యవసాయరంగంలో ఆహార భద్రతకు ఎదురయ్యే సవాళ్లపై చర్చించనున్నారు. ప్రపంచ దేశాల నుంచి 1200 మంది ప్రతినిధులు ఈ సదస్సకు హాజరుకానున్నారు. అలాగే ఆన్లైన్ ద్వారా వేలాది మంది పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఈ నెల 22 నుంచి 29 వరకు మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికాకు వెళ్లనున్నారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు బృందం సైతం అమెరికాకు వెళ్లనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
car plunges into gorge | లోయలో పడిన కారు.. ఆరుగురు మహిళలతో సహా ఏడుగురు మృతి, మరో ఐదుగురికి గాయాలు
‘విద్యార్థులకు నిర్దేశిత మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి’
‘సాగునీటి తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

