Munugode By polls Results | మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖరారైంది. రెండు, మూడు రౌండ్లు మినహా ప్రతి రౌండ్లోనూ కారు గుర్తుకు స్పష్టమైన ఆధిక్యం లభించింది. ఇప్పటి వరకు 12వ రౌండ్లకు సంబంధించి కౌంటింగ్ పూర్తయ్యింది. ఇప్పటి వరకు దాదాపు 7వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతున్నది. మరో మూడు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండగా.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
రౌండ్ల వారీగా టీఆర్ఎస్కు ఆధిక్యం వస్తుండడంతో ఆయన కేంద్రం తీవ్ర నిరాశ్యంలో ఇంటిముఖం పట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తన ఓటమిని అంగీకరిస్తున్నానన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చామన్నారు.