సెమీస్‌లో షెల్టన్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రసవత్తరంగా సాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్ పోరులో బెన్ షెల్టన్ 6-2, 3-6, 7-6(7), 6-2తో ఫ్రాన్సెస్ టియాఫోపై అద్భుత విజయం సాధించాడు.
- బోపన్న, ఎబ్డెన్ జోడీ ముందంజ
- యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రసవత్తరంగా సాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్ పోరులో బెన్ షెల్టన్ 6-2, 3-6, 7-6(7), 6-2తో ఫ్రాన్సెస్ టియాఫోపై అద్భుత విజయం సాధించాడు. ఈ ఇద్దరు అమెరికా ప్లేయర్ల మధ్య పోరు యుద్ధాన్ని తలపించింది. మ్యాచ్‌లో ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన 20 ఏండ్ల అమెరికా యువ సంచలనం షెల్టన్ 14 ఏస్‌లు సంధించాడు. ఆడుతున్న తొలిసారే యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మంగళవారం సాయంత్రం మొదలైన బుధవారం అర్ధరాత్రి మ్యాచ్ ముగిసిందంటే ఇరువురి ఎలాంటి పోరు జరిగిందో ఊహించుకోవచ్చు. రాకెట్ స్పీడ్‌ను తలపిస్తూ షెల్టన్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్లకు టియాఫో కూడా అంతే దీటుగా స్పందించాడు. 1968 తర్వాత ఓపెన్ ఎరాలో ఇద్దరు అమెరికా ప్లేయర్లు క్వార్టర్స్‌లో తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. శుక్రవారం జరిగే సెమీస్‌లో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్‌తో షెల్టన్ తలపడుతాడు.
సెమీస్‌లో బోపన్న జోడీ:
భారత వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న..యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. ఎబ్డెన్తో కలిసి బుధవారం పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో ఆడిన బోపన్న 7-6 (12-10), 6-1తో అమెరికా ద్వయం విత్రో, లామన్స్పై అద్భుత విజయం సాధించాడు. తన అనుభవాన్నంత ఉపయోగిస్తూ బోపన్న..టైటిల్ వేటకు మరింత చేరువయ్యాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

