Cyclone | బంగాళాఖాతంలో మరో తుఫాన్.. రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు
Cyclone | నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించింది. గురువారం ఉదయం నుంచి మధ్య బంగాళాఖాతంలో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది.
- వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించింది. గురువారం ఉదయం నుంచి మధ్య బంగాళాఖాతంలో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నది. శుక్రవారం వరకు సముద్రం పరిస్థితి కూడా చాలా ఉధృతంగా ఉండే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి.
శుక్ర, శనివారాల్లో బాలాసోర్, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. శనివారం రాత్రి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని, తుఫానుగా మారి ఒడిశాతీరం దిశగా పయనించే అవకాశం కూడా ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

